ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రిస్మస్‌కు 12 అదనపు ప్రత్యేక రైళ్లు

ABN, First Publish Date - 2020-12-05T08:42:52+05:30

క్రిస్మస్‌ పండుగను దృష్టిలో పెట్టుకుని అదనంగా 12 ప్రత్యేక రైళ్లను ప్రారంభిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఇవన్నీ రిజర్వేషన్‌ రైళ్లు అని పేర్కొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): క్రిస్మస్‌ పండుగను దృష్టిలో పెట్టుకుని అదనంగా 12 ప్రత్యేక రైళ్లను ప్రారంభిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఇవన్నీ రిజర్వేషన్‌ రైళ్లు అని పేర్కొంది. ప్రతి రోజూ నడిచే చామరాజనగర్‌-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ రైలు ఈ నెల 7న ప్రారంభమై 31 వరకు కొనసాగుతుందని, తిరుపతి-చామరాజనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు(డెయిలీ) 8న ప్రారంభమై జనవరి 1 వరకు కొనసాగుతుందని వివరించింది.


కేఎ్‌సఆర్‌ బెంగళూరు-నాందెడ్‌ ఎక్స్‌ప్రెస్‌(డెయిలీ) ఈ నెల 7న ప్రారంభమై జనవరి 1 వరకు, నాందెడ్‌-కేఎ్‌సఆర్‌ బెంగళూరు ఎక్స్‌ప్రె్‌స(డెయిలీ) 9న ప్రారంభమై జనవరి 1 వరకు కొనసాగుతాయని తెలిపింది. మైసూరు-బాగల్‌కోట్‌ రైలు(డెయిలీ) 7న ప్రారంభమై ఈనెల 16 వరకు, బాగల్‌కోట్‌-మైసూరు 8న ప్రారంభమై ఈ నెల 17 వరకు కొనసాగుతాయి. గురువారం నడిచే యశ్వంత్‌పూర్‌-జైపూర్‌ సువిధ ఎక్స్‌ప్రెస్‌ ఈనెల 10, 17, 24, 31 తేదీల్లో యశ్వంత్‌పూర్‌ నుంచి బయలుదేరుతుంది.


శనివారం నడిచే జైపూర్‌-యశ్వంత్‌పూర్‌ రైలు ఈ నెల 12, 19, 26, జనవరి 2 తేదీల్లో బయలుదేరుతుంది. శుక్రవారం నడిచే కేఎ్‌సఆర్‌ బెంగళూరు-ఆజ్మేర్‌ రైలు ఈ నెల 11, 18, 25 తేదీల్లో, సోమవారం నడిచే ఆజ్మేర్‌-బెంగళూరు రైలు ఈ నెల 14, 21, 28 తేదీల్లో బయలుదేరుతాయి.

ఆదివారం నడిచే కేఎ్‌సఆర్‌ బెంగళూరు-జోధ్‌పూర్‌ రైలు ఈ నెల 13, 20, 27 తేదీల్లో, ప్రతి బుధవారం నడిచే జోధ్‌పూర్‌-కేఎ్‌సఆర్‌ బెంగళూరు రైలు ఈ నెల 16, 23, 30 తేదీల్లో ప్రారంభమవుతాయని రైల్వే శాఖ వివరించింది. 


Updated Date - 2020-12-05T08:42:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising