ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

1,015 కరోనా కొత్త కేసులు

ABN, First Publish Date - 2020-11-13T09:11:20+05:30

రాష్ట్రంలో బుధవారం 1,015 కరోనా కేసులు నమోదయ్యాయి. వైర్‌సతో మరో ముగ్గురు మృతి చెందారు. దీంతో మొత్తం బాధితుల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్రంలో వైర్‌సతో మరో ముగ్గురి మృతి

హైదరాబాద్‌, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బుధవారం 1,015 కరోనా కేసులు నమోదయ్యాయి. వైర్‌సతో మరో ముగ్గురు మృతి చెందారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 2,54,666కు, మృతుల సంఖ్య 1,393కు పెరిగింది. తాజాగా 1,716 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 2,35,950కు చేరింది. రికవరీ రేటు 92.65 శాతంగా ఉంది. 17,323 యాక్టివ్‌ కేసులకు గాను, 14,694 మంది హోంఐసోలేషన్‌లో ఉన్నారు.


బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 40,603 నమూనాలను సేకరించినట్లు వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్‌లో పేర్కొంది. ఇప్పటివరకు 47,70,004 నమానాలను పరీక్షించినట్లు తెలిపింది. మరో 377 నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని వివరించింది. తెలంగాణలో ప్రతి పది లక్షల జనాభాకు పరీక్షల సంఖ్య 1,28,157కు పెరిగిందని పేర్కొంది.


కాగా, కొత్త కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 172 రాగా, తర్వాతి స్థానాల్లో రంగారెడ్డి (98), మేడ్చల్‌-మల్కాజిగిరి (97), నల్లగొండ (57), ఖమ్మం (48), కరీంనగర్‌ (46) ఉన్నాయి. కుమ్రంభీం-అసిఫాబాద్‌లో 5, ఆదిలాబాద్‌లో 6, నారాయణపేటలో రెండు నమోదయ్యాయి.


Updated Date - 2020-11-13T09:11:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising