ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

17 రోజుల్లో 10 లక్షల పరీక్షలు

ABN, First Publish Date - 2020-09-12T08:30:56+05:30

రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్య 20 లక్షలు దాటింది. ఆగస్టు 24వ తేదీ నుంచి రోజూ సగటున 60 వేల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 20 లక్షలు దాటిన టెస్టులు

కొత్తగా 2,426 మందికి పాజిటివ్‌


హైదరాబాద్‌, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్య 20 లక్షలు దాటింది. ఆగస్టు 24వ తేదీ నుంచి రోజూ సగటున 60 వేల టెస్టులు చేస్తున్నారు. అప్పటికి 10 లక్షల పరీక్షలు నిర్వహించగా.. 1,08,670 మందికి పాజిటివ్‌ వచ్చింది.


కాగా, కరోనా తొలి కేసు నమోదు నుంచి పది లక్షల పరీక్షలు చేయడానికి వైద్య ఆరోగ్య శాఖకు 5 నెలల 23 రోజుల సమయం పట్టింది. ఈ 17 రోజుల్లోనే మరో 10 లక్షల పరీక్షలు చేయడం గమనార్హం. ప్రస్తుతం ప్రతి పది లక్షల మందికి పరీక్షల సంఖ్య 54,313కు చేరుకుంది.


మరోవైపు గురువారం కొత్తగా 2,426 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,52,602 అయింది. తాజాగా 2,324 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు 1,19,467 మంది కోలుకున్నారు. కొత్త కేసుల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌లో 338 నమోదయ్యాయి.

కరీంనగర్‌లో 128, ఖమ్మంలో 98, మేడ్చల్‌లో 172, నల్లగొండలో 164, రంగారెడ్డిలో 216, సంగారెడ్డిలో 97, సిద్దిపేటలో 87, వరంగల్‌ అర్బన్‌లో 108 పాజిటివ్‌లు వచ్చాయి. కొత్తగా 13 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 940కు చేరుకుంది.


Updated Date - 2020-09-12T08:30:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising