అదనపు భద్రత కోసం జూమ్ టూ- ఫ్యాక్టర్ అథెంటికేషన్
ABN, First Publish Date - 2020-09-15T00:55:11+05:30
అదనపు భద్రత కోసం జూమ్ టూ- ఫ్యాక్టర్ అథెంటికేషన్
న్యూఢిల్లీ: ప్రముఖ సంస్థ జూమ్ వీడియో కమ్యూనికేషన్స్ కొత్త అప్లికేషన్‌ను ప్రవేశపెడుతోంది. అడ్మిన్‌లు, సంస్థలు తమ యూజర్లను రక్షించేందుకు ప్లాట్‌ఫారం నుంచే భద్రతా ఉల్లంఘనలను నివారించే చర్యలను జూమ్ Two-Factor Authenticationను ప్రవేశపెడుతోంది. ఆన్‌లైన్ యూజర్లను, ఆ నిర్ధారిత అక్కౌంట్‌కు వారి యాజమాన్యాన్ని అథెంటికేట్ చేసే, యూజర్‌కు తెలిసినవి పాస్‌వర్డ్ లేదా పిన్, స్మార్ట్ కార్డ్ లేదా మొబైల్ డివైజ్ వంటి రెండు లేదా అంతకంటే ఎక్కువ వాటిని సమర్పించడం ద్వారా గుర్తిస్తుంది.
జూమ్ టూ- ఫ్యాక్టర్ అథెంటికేషన్ వల్ల లాభాలు
2ఎఫ్ఏలోని యూనిఫైడ్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫారం, యూజర్లను భద్రంగా వాలిడేట్ చేసేందుకు, భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించకుండా రక్షించడంతోపాటు మరెన్నో ఉపయోగాలను కూడా అందిస్తుంది. 2ఎఫ్ఏతో సంస్థ గుర్తింపు చౌర్యానికి గురికాకుండా రక్షించబడేందుకు అదనంగా మరొక భద్రతా వలయం పెంచబడినందున పాస్‌వర్డ్‌లను ఊహించి లేదా ఉద్యోగుల లేదా విద్యార్థుల డివైజ్‌లకు యాక్సెస్ పొందడం ద్వారా, వారి అక్కౌంట్లకు యాక్సెస్ పొందాలనుకొనే తప్పుడు ఆలోచనల నుంచి రక్షణ కలుగుతుంది.
2ఎఫ్ఏను అమలు పరచడం ద్వారా సంస్థలు, సున్నితమైన డేటా, వినియోగదారుల సమాచారానికి సంబంధించి ప్రామాణికతా పరమైన చిక్కులను నివారించవచ్చు. చిన్న వ్యాపార సంస్థలు, పాఠశాలలు, ఎస్ఎస్‌వో సర్వీసుకు అధికంగా చెల్లించవలసి ఉంటుంది. జూమ్స్ 2ఎఫ్ఏ యూజర్లను ఉచితంగా, ప్రభావవంతంగా వాలిడేట్ చేయడమే కాక, భద్రతా ఉల్లంఘనల నుంచి కూడా రక్షణ ఇస్తోంది. యూజర్లను నిరంతర పాస్‌వర్డ్ నిర్వహణ నుంచి రక్షించడంతోపాటు, ఒక అదనపు భద్రతా వలయాన్ని కూడా అందిస్తుంది.
జూమ్స్ 2ఎఫ్ఏతో యూజర్లు టైమ్-బేస్డ్ వన్-టైమ్ పాస్‌వర్డ్ ప్రొటోకాల్‌కు మద్దతిచ్చే అథెంటికేషన్ యాప్‌లు ఉపయోగించే లేదా ఎస్‌ఎంఎస్ లేదా ఫోన్ కాల్‌ద్వారా జూమ్ మీకు ఒక కోడ్ పంపే ఐఛ్ఛికాన్ని అందిస్తుంది. జూమ్స్ 2ఎఫ్ఏ ఎనేబుల్ చేసుకోవడమెలా, ఒక అక్కౌంట్‌కు వ్యక్తిగతంగా ఎనేబుల్ లేదా డిజేబుల్ చేసుకోవడానికి, జూమ్ అందించే ఎస్ఏఎంఎల్, పాస్‌వర్డ్ ఆధారిత అథెంటికేషన్ వంటి విస్తృత శ్రేణిలోని అథెంటికేషన్ విధానాలను అందిస్తోంది.
జూమ్స్ 2ఎఫ్ఏను పాస్‌వర్డ్-ఆధారిత అథెంటికేషన్‌కు అక్కౌంట్-స్థాయిలో ఎనేబుల్ చేసుకోవడానికి అక్కౌంట్ అడ్మిన్‌లు కింద తెలిపిన విధంగా చేయాలి.
జూమ్ డాష్‌బోర్డ్‌కు సైన్-ఇన్ అవ్వాలి. నావిగేషన్ మెనూలో, అడ్వాన్సెడ్‌పై క్లిక్ చేసి, ఆ తరువాత, సెక్యూరిటీపై క్లిక్ చేయాలి. టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎనేబుల్ అయిన ఐఛ్ఛికంతో సైన్-ఇన్ అయ్యారని నిర్ధారించుకోవాలి. 2ఎఫ్ఏను ఎనేబుల్ చేసుకోవడానికి కిందివాటిలో ఒక ఐఛ్ఛికాన్ని ఎంచుకోవాలి. మీ అక్కౌంట్‌లోని యూజర్లందరూ 2ఎఫ్ఏను ఎనేబుల్ చేసుకొని ఉండాలి. ప్రత్యేక రూల్స్‌లోని యూజర్లు, కొన్ని ప్రత్యేక రూల్స్‌లోని వారికి 2ఎఫ్ఏ ఎనేబుల్ చేయాలి.
నిర్ధారిత ఎంపిక హోదాలపై క్లిక్ చేయాలి. ఆపై ఓకేపై క్లిక్ చేయాలి. కొన్ని నిర్ధారిత గ్రూప్స్‌కు చెందిన యూజర్లు కొన్ని నిర్ధారిత గ్రూప్స్‌లో ఉన్న యూజర్లను ఎనేబుల్ చేయాలి. పెన్సిల్ ఐకాన్‌పై క్లిక్ చేసి, గ్రూప్స్‌ను ఎంచుకొని, ఆ తరువాత ఓకేపై క్లిక్ చేయాలి. 2ఎఫ్ఏ సెట్టింగ్‌లను నిర్ధారించేందుకు ’సేవ్’పై క్లిక్ చేయాలి. జూమ్స్ 2ఎఫ్ఏ గురించి మరింత తెలుసుకోవడానికి మీ సంస్థలోని యూజర్లకు ఎనేబుల్ చేయడానికి సపోర్ట్ పేజీకి వెళ్లాలి. జూమ్ ఫ్లాట్ ఫారం భద్రత గురించి తెలుసుకోవడానికి సెక్యూరిటీ వెబ్‌పేజీకి వెళ్లాలి.
Updated Date - 2020-09-15T00:55:11+05:30 IST