ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముందుగా ఆ ఫోన్లకే ఎందుకు?

ABN, First Publish Date - 2020-02-22T06:25:27+05:30

గూగుల్‌ సంస్థ ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టం లేటెస్ట్‌ వెర్షన్స్‌ను మొట్టమొదట పిక్సెల్‌ ఫోన్లకు మాత్రమే ఎందుకు అందిస్తుంది?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గూగుల్‌ సంస్థ ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టం లేటెస్ట్‌ వెర్షన్స్‌ను మొట్టమొదట పిక్సెల్‌ ఫోన్లకు మాత్రమే ఎందుకు అందిస్తుంది? 

- రాజశేఖర్‌


గూగుల్‌ ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టం రూపొందించేటప్పుడు తాను స్వయంగా తయారు చేసిన పిక్సెల్‌ ఫోన్ల మీద ప్రయోగాలు చేస్తుంది. ఆ కారణం చేత డెవలపర్‌ ప్రివ్యూ వెర్షన్‌ మొట్టమొదట పిక్సెల్‌ ఫోన్లకే లభిస్తుంది. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆండ్రాయిడ్‌ బీటా ప్రోగ్రాంలో భాగంగా ఏవైతే ఫోన్‌ తయారీ సంస్థలు ఆండ్రాయిడ్‌ లేటెస్ట్‌ వెర్షన్‌ తమ ఫోన్లకు బీటా రూపంలో అందించడానికి సిద్ధంగా ఉంటాయో ఆయా ఫోన్లను కూడా బీటా వెర్షన్‌ జాబితాలో చేర్చుకోవడం జరుగుతుంది. ఆండ్రాయిడ్‌ వెర్షన్‌లో ఆపరేటింగ్‌ సిస్టంలో తయారు చేసేది గూగుల్‌ సంస్థ అయితే, ఫోన్‌లను తయారు చేసేది ఇతర  కంపెనీలు కాబట్టి అవి సంసిద్ధత వ్యక్తం చేయకుండా గూగుల్‌ తనకు తాను ఆండ్రాయిడ్‌ లేటెస్ట్‌ వెర్షన్‌ మార్కెట్లో ఉన్న అన్ని ఫోన్లకు అందించలేదు. ఈ పరిస్థితిని మార్చడానికి గూగుల్‌ తాజాగా పలు రకాల పద్ధతులు తీసుకువస్తోంది. ఆపరేటింగ్‌ సిస్టమ్‌ అప్‌డేట్‌కు సంబంధించిన పార్టిషన్‌ ఒకటి మాత్రమే విడిగా అప్‌డేట్‌ అయ్యే విధంగా ప్రాజెక్ట్‌ ట్రెబల్‌ వంటి పద్ధతులు కూడా తీసుకు వచ్చినప్పటికీ, అధిక శాతం ఫోన్‌ తయారీ కంపెనీలు దీనిని అమలు పరచడానికి ముందుకు రాలేదు.


మీ టెక్‌ సందేహాలకు సమాధానాల కోసం:

navya@andhrajyothy.com

Updated Date - 2020-02-22T06:25:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising