ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాట్సాప్‌ పైనా కరోనా ఎఫెక్ట్: వాట్సాప్‌ కీలక నిర్ణయం.. ఇప్పటికే అమల్లోకి..

ABN, First Publish Date - 2020-03-30T23:53:24+05:30

వాట్సాప్‌లో వీడియోను స్టేటస్‌గా అప్‌లోడ్ చేసే సందర్భంలో వీడియో నిడివి ఇన్నాళ్లూ 30 సెకన్లు ఉండేది. భారత్‌లో ఈ నిడివిని 15 సెకన్లకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాట్సాప్‌లో వీడియోను స్టేటస్‌గా అప్‌లోడ్ చేసే సందర్భంలో వీడియో నిడివి ఇన్నాళ్లూ 30 సెకన్లు ఉండేది. భారత్‌లో ఈ నిడివిని 15 సెకన్లకు కుదిస్తూ వాట్సాప్ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, నిర్ణయం తీసుకున్న వెంటనే అమలులోకి తెచ్చింది. దీంతో.. వాట్సాప్‌లో స్టేటస్‌గా వీడియోను అప్‌లోడ్ చేద్దామనుకునే వారికి 15 సెకన్ల వరకే అవకాశం ఉంది. అంతకు మించి అప్‌లోడ్ చేయాలంటే వీడియోను మరోసారి అప్‌లోడ్ చేసి కొనసాగింపుగా మరో 15 సెకన్ల వరకూ ట్రిమ్ చేయాల్సిందే.


ఇలా కాస్త ఎక్కువ నిడివి కలిగిన వీడియోను అప్‌లోడ్ చేయాలంటే ముక్కలుముక్కలుగా వీడియోను ట్రిమ్ చేయాల్సిందే. అయితే.. భారత్‌లో కరోనా వైరస్ కట్టడికి లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరిగింది. దీంతో.. సర్వర్లపై భారాన్ని తగ్గించే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాట్సాప్ వెల్లడించింది. అయితే.. లాక్‌డౌన్ ఎత్తేశాక తిరిగి 30 సెకన్ల వీడియోను స్టేటస్‌గా పెట్టుకునేందుకు అవకాశం ఉంటుందో.. లేదో వాట్సాప్ యాజమాన్యం స్పష్టం చేయలేదు.

Updated Date - 2020-03-30T23:53:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising