ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీవీ రిమోట్‌ టెక్నాలజీతో గ్రహాంతర రహస్యాలు కనుక్కోవచ్చా?

ABN, First Publish Date - 2020-03-05T03:24:29+05:30

ఆ ప్రాజెక్ట్‌ పేరు డబ్ల్యూ ఫస్ట్‌ ... వైడ్‌ ఫీల్డ్‌ ఇన్‌ఫ్రారెడ్‌ సర్వే టెలిస్కోప్‌ ( WFIRST ). నాసా ( NASA ) వారి గొప్ప ప్రాజెక్ట్‌ అది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ ప్రాజెక్ట్‌ పేరు డబ్ల్యూ ఫస్ట్‌ ...  వైడ్‌ ఫీల్డ్‌ ఇన్‌ఫ్రారెడ్‌ సర్వే టెలిస్కోప్‌ (  WFIRST ). నాసా ( NASA ) వారి గొప్ప ప్రాజెక్ట్‌ అది! ఇంతకాలానికి ఈ ప్రాజెక్ట్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. అంతరిక్షాన్ని మరింత గొప్పగా పరిశోధించి, విశ్వపు వింతలు ఎన్నింటినో కొత్తగా తెలుసుకునే అవకాశం కల్సిస్తుంది ఈ ప్రాజెక్ట్‌.


WFIRST అనగానే చాలామంది వరల్డ్‌ ఫస్ట్‌ అని అనుకునే అవకాశమూ ఉంది. ఒకవేళ ఎవరైనా అలా అనుకున్నా అది కూడా నిజమే! ఎందుకంటే ప్రపంచంలో ఇలాంటి ప్రయోగాల్లో ఇది మొట్టమొదటిది.


అదేంటి? అంతరిక్షంలోకి టెలిస్కోప్‌తో చూసి విషయాలు తెలుసుకోవడం,  విశ్వపు వింతల్ని కనిపెట్టడం - ఇప్పటి విషయం ఏమీ కాదు కదా? ఎప్పటినుంచో ఉన్నదే కదా? ప్రపంచంలోనే మొట్టమొదటిది ఎలా అవుతుంది? - ఇదేగా మీ సందేహం? నిజంగా ప్రపంచంలో ఈ స్థాయి టెలిస్కోప్‌ల్లో మొట్టమొదటిది ఇదే! ఈ స్థాయి అంతరిక్ష పరిశోధన ప్రయోగం కూడా ఇదే అవుతుంది.


ప్రస్తుత టెలిస్కోప్‌ టీవీ రిమోట్‌లో మనం వాడే ఇన్‌ఫ్రారెడ్‌ టెక్నాలజీనే విశ్వస్థాయికి విస్తరించి రూపొందించిన విశిష్టమైన టెలిస్కోప్‌ ని ఈ పరిశోధనల్లో వాడబోతున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన నాసా వారి హబుల్‌ టెలిస్కోప్‌ కంటే ఇది వంద రెట్ల దూరాన్ని చూడగలుగుతుంది.


ఇంతకాలం కొన్ని సాంకేతిక కారణాల వల్ల నాసా  డబ్ల్యూ ఫస్ట్‌ ప్రాజెక్ట్‌ని వాయిదా వేస్తూ వచ్చింది. ఇప్పుడు దీనికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇప్పటికే హార్డ్‌ వేర్‌ తయారీ, టెస్టింగులు మొదలయ్యాయి. కాబట్టి రాబోయే రోజుల్లో మనం ఇంతకాలం ఎరగని ఎన్నో విశ్వరహస్యాలు బయటపడడం జరుగుతుందని అందరూ ఆశించవచ్చు.

Updated Date - 2020-03-05T03:24:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising