ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా? అయితే మీకో హెచ్చరిక!

ABN, First Publish Date - 2020-06-02T03:22:59+05:30

ఆండ్రాయిడ్ ఫోన్లు వాడుతున్న వినియోగదారులకు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఆండ్రాయిడ్ ఫోన్లు వాడుతున్న వినియోగదారులకు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన ‘ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం’ (సెర్ట్ ఇండియా) హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికీ పాత ఆపరేటింగ్ సిస్టంను వాడుతున్న వారు సైబర్ నేరగాళ్ల బారినపడే అవకాశం ఉందని పేర్కొంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని, ఫోన్లలోని వ్యక్తిగత సమాచారం వారి చేతికి చిక్కకుండా జాగ్రత్త పడాలని సూచించింది. 


గూగుల్ ఆండ్రాయిడ్‌లోని స్టాండ్‌హాగ్‌లో 2.0 అనే బగ్ ఉన్నట్టు గుర్తించామని సెర్ట్ ఇండియా నిపుణులు తెలిపారు. ఏ ఫోన్ అయినా దీని బారినపడితే అందులోని ఏ యాప్‌నైనా హ్యాకర్లు.. ఫోన్ మైక్, కెమెరా ద్వారా చాలా సులభంగా హైజాక్ చేసే ప్రమాదం ఉందని, ఫోన్‌లోని లాగిన్ క్రెడెన్షియల్స్, మెసేజ్‌లు, ఫోన్ సంభాషణలు, ఫొటోలు వంటి వాటిని తస్కరిస్తారని పేర్కొన్నారు. ముఖ్యంగా లేటెస్ట్ వెర్షన్ ఆండ్రాయిడ్ 10కు అప్‌డేట్ కాని ఫోన్లలోని వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల బారినపడే అవకాశం ఉందని, కాబ్టటి వీలైనంత త్వరగా అప్‌డేట్లను, ప్యాచెస్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని కోరింది.

Updated Date - 2020-06-02T03:22:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising