కొత్త ఫీచర్లతో వివో వై20ఏ స్మార్ట్‌ఫోన్ విడుదల
ABN, First Publish Date - 2020-12-31T03:41:55+05:30
కొత్త ఫీచర్లతో వివో వై20ఏ స్మార్ట్‌ఫోన్ విడుదల
న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వివో తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త మోడళ్లలో కొత్త స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో భారత మార్కెట్‌లో అద్భుత ఫీచర్లతో వివో వై20ఏ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసినట్లు కంపెనీ పేర్కొంది.
వివో వై20ఏ స్మార్ట్‌ఫోన్‌కు 6.51 అంగుళాల డిస్‌ప్లే, 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. రెండు రంగుల్లో వివో వై20ఏ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. జనవరి 2వ తేదీ నుంచి ఫోన్లను విక్రయించనున్నట్లు సంస్థ పేర్కొంది. 3జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ వివో వై20ఏ స్మార్ట్‌ఫోన్ రూ. 11,490కే అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది.
Updated Date - 2020-12-31T03:41:55+05:30 IST