ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అయ్యబాబోయ్‌! ఒక్క ఫోనులో ఇన్ని ఫీచర్లా!!

ABN, First Publish Date - 2020-03-01T01:11:38+05:30

స్మార్ట్‌ఫోన్లు ఇప్పుడు నిత్యావసరాలు. కానీ ప్రతిరోజూ వాటిలో కొత్త టెక్నాలజీ జతపడదు. కొత్త ఫీచర్లు లేకపోయినా - అవసరం కొద్దీ స్మార్ట్‌ఫోన్లన్నీ క్రేజీగానే అమ్ముడుపోతున్నాయిప్పుడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్మార్ట్‌ఫోన్లు ఇప్పుడు నిత్యావసరాలు. కానీ ప్రతిరోజూ వాటిలో కొత్త టెక్నాలజీ జతపడదు. కొత్త ఫీచర్లు లేకపోయినా - అవసరం కొద్దీ స్మార్ట్‌ఫోన్లన్నీ క్రేజీగానే అమ్ముడుపోతున్నాయిప్పుడు. అయితే - ఈ రకం ఫోన్లన్నిటినీ మించిపోతూ ఏదైనా కొత్త ఫీచర్‌ వస్తే బాగుండును - అనుకుంటారు స్మార్ట్‌ ఫోన్‌ ప్రియులు. ఎందుకంటే అలాంటి ఫీచర్‌ ఒక్కటైనా ఉన్నప్పుడే - ఫోన్‌ రేపటి తరానిది - అనిపిస్తుంది. అయితే అలాంటి వారి కోసం - కేవలం ఒకటీ రెండూ కాదు - అనేక కొత్త ఫీచర్లను నింపుకుంటూ సంచలనాత్మకంగా రిలీజ్‌ కాబోతోంది ఒక ఫోన్‌! అదే వివో ( Vivo) కంపెనీ నించి వస్తున్న ఎపెక్స్‌ 2020 ( APEX 2020 ). ఇది ఓ గొప్ప కాన్సెప్ట్ ఫోన్‌.

వివో - ఈ ఎపెక్స్‌ 2020 లో ఎలాంటి ఫీచర్లని అందిస్తోందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యానికి గురవుతారు.


త్వరలో రాబోతున్న ఈ ఫోన్లో ఉండబోతున్న ఫీచర్లూ ప్రత్యేకతలూ ఇవే :


* ఫోన్‌ ఫ్రంట్‌ కెమెరా - ఫోన్‌ డిస్‌ ప్లే లోనే అంతర్భాగంగా ఉండే విధంగా.. ఇన్‌- డిస్‌ప్లే కెమెరా

* వీడియో తీసేటప్పుడు ఎవరు మాట్లాడుతుంటే వాళ్లని గుర్తించి కెమెరా వారినే ఫోకస్‌ చేసే - వాయిస్‌ ట్రాకింగ్‌ ఆటో ఫోకస్‌

* 120 డిగ్రీల కర్వ్‌డ్‌ డిస్‌ప్లే

* బటన్స్‌ పోర్టులూ లేని మొబైల్‌ ఇది!

* ఫొటోలో అనవసరమైన విషయాల్ని తొలగించే .. ఫొటో బాంబ్‌ రిమూవర్‌

* తీసే దృశ్యాల్లో ఏ విధమైన షేకింగ్‌ లేకుండా ఉండేందుకు  గింబల్‌సాయం తీసుకునే గింబల్‌ స్టెబిలైజ్డ్ కెమెరా

* అత్యంత వేగవంతంగా ఫోన్‌ని వైర్‌లెస్‌ గా ఛార్జ్‌ చేసే 60W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌

* క్వాలిటీ సౌండ్‌ అందించలేని రెగ్యులర్‌ ఫోన్‌ స్పీకర్ల స్థానంలో - స్క్రీన్‌నే స్పీకర్‌ గా మార్చే స్క్రీన్‌ సౌండ్ కాస్టింగ్‌ టెక్నాలజీ


గతంలో ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌, పాపప్‌ కెమెరా లాంటి కొత్త ఫీచర్లని పరిచయం చేసిన వివో  ఈ కొత్త ఎపెక్స్‌ 2020 తో మరిన్ని సంచలనాలు సృష్టిస్తుందని ఆశించవచ్చు.

Updated Date - 2020-03-01T01:11:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising