ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వర్చ్యువల్‌ విజిటింగ్‌ కార్డు!

ABN, First Publish Date - 2020-08-15T05:32:45+05:30

సోషల్‌ మీడియాలో మీ సమాచారం మరింత హైలెట్‌ చేసుకోవడానికి గూగుల్‌ ‘పీపుల్‌ కార్డ్స్‌’ పేరుతో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్‌ సహాయంతో వినియోగదారులు వర్చ్యువల్‌ విజిటింగ్‌ కార్డు తయారుచేసుకోవచ్చు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోషల్‌ మీడియాలో మీ సమాచారం మరింత హైలెట్‌ చేసుకోవడానికి గూగుల్‌ ‘పీపుల్‌ కార్డ్స్‌’ పేరుతో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్‌ సహాయంతో వినియోగదారులు వర్చ్యువల్‌ విజిటింగ్‌ కార్డు తయారుచేసుకోవచ్చు. వ్యాపారవేత్తలుగా ఎదగాలని ప్రయత్నిస్తున్న వారికి, ఫ్రీలాన్సర్లకు, సెల్ఫ్‌ ఎంప్లాయిమెంట్‌ను ఎంచుకున్న వారికి ఇది బాగా ఉపయోగపడనుంది. గూగుల్‌ అకౌంట్‌ ద్వారా ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. పీపుల్‌ కార్డును ఎలా క్రియేట్‌ 


చేసుకోవాలంటే...

  1. ముందుగా గూగుల్‌ అకౌంట్‌లోకి సైనిన్‌ కావాలి.
  2. తరువాత సెర్చ్‌ బార్‌లో ‘యాడ్‌ మీ టు సెర్చ్‌’ అని టైప్‌ చేసి ఎంటర్‌ బటన్‌ నొక్కాలి. 
  3. ఇప్పుడు ‘యాడ్‌ యువర్‌సెల్ఫ్‌ టు గూగుల్‌ సెర్చ్‌’ ఆప్షన్‌ కనిపిస్తుంది. అక్కడే ఉన్న గెట్‌ స్టార్ట్‌ బటన్‌ని ఎంచుకోవాలి.
  4. వెరిఫికేషన్‌ కోసం ఫోన్‌ నంబర్‌ అడుగుతుంది. నంబర్‌ ఎంటర్‌ చేశాక, మొబైల్‌కి వచ్చిన కోడ్‌ని ఎంటర్‌ చేయాలి.
  5. తరువాత మీ పేరు, వివరాలు, మీ గురించిన  సమాచారం, చేస్తున్న పని, వెబ్‌సైట్‌ ఉంటే దాని వివరాలు, ఈమెయిల్‌ ఐడీ నమోదు చేసి, ఒకసారి ప్రివ్యూ చూసుకుని సేవ్‌ బటన్‌పై క్లిక్‌ చేయాలి. అంతే.. మీ వర్చ్యువల్‌ విజిటింగ్‌ కార్డ్‌ గూగుల్‌లో అందుబాటులో ఉంటుంది.

Updated Date - 2020-08-15T05:32:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising