ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐటి బాంబేలో వర్చ్యువల్‌ కాన్వకేషన్‌

ABN, First Publish Date - 2020-08-29T05:30:00+05:30

కొవిడ్‌ నేపథ్యంలో ఈ రోజుల్లో అన్నీ ఇంటర్నెట్‌ సహాయంతోనే కానిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవిడ్‌ నేపథ్యంలో ఈ రోజుల్లో అన్నీ ఇంటర్నెట్‌ సహాయంతోనే కానిస్తున్నారు. జూమ్‌ వంటి సాధనాలతో సమావేశాలు, సెమినార్లు, క్లాస్‌రూమ్‌లు నిర్వహిస్తున్నారు. ఈ విషయంలో బాంబే ఐఐటి మరో అడుగు ముందుకు వేసింది. టెర్మినేటర్‌ సీన్‌ను సృష్టించింది. తమ 58వ కాన్వకేషన్‌ సెరిమనీ(పట్టాల స్వీకరణ ఉత్సవం)ని వర్చ్యువల్‌ మోడ్‌లో నిర్వహించింది.


నిజానికి  కోర్సు పూర్తి చేసుకుని బైటకు వెళుతున్న విద్యార్థికి పట్టాను ఐఐటి డైరెక్టర్‌ అందిస్తారు. సరిగ్గా ఆ అనుభవాన్ని వర్చ్యువల్‌ అవతార్‌ రూపంలో చూపింది. అంటే విద్యార్థి వేదికపైకి రావడం నుంచి పట్టా తీసుకోవడం వరకు అంతా విజువలైజ్‌ చేసింది. అలాగే దీనికి ముందు రోజు హాస్టల్‌ వాతావరణాన్ని, ఈ కార్యక్రమంతో క్యాంపస్‌ పరేడ్‌ సీన్‌ను కూడా కలిపింది. సుమారు ఇరవై మంది బృందంగా రెండు నెలల ముందు నుంచి ఈ పనిలో నిమగ్నమయ్యారు.  ఇప్పటికే లక్ష డెబ్బయ్‌ వేలకు మించి దీన్ని వీక్షించారు. ఏమైతేనేం,  తమ సీనియర్లు మాదిరిగానే ఈ ఏడాది విద్యార్థులకూ క్యాంపస్‌లో పెరేడ్‌ సహా యావత్తు అనుభవాన్ని ఈ రూపంలో మిగిల్చారు.


Updated Date - 2020-08-29T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising