ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌లో యూట్యూబ్‌ వీక్షకులు 32.5 కోట్లు

ABN, First Publish Date - 2020-10-31T06:34:13+05:30

గూగుల్‌కు చెందిన యూట్యూబ్‌కు భారతదేశంలో వీక్షకాదరణ రోజురోజుకు పెరుగుతోంది. పద్దెనిమిదేళ్ళకు మించిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గూగుల్‌కు చెందిన యూట్యూబ్‌కు భారతదేశంలో వీక్షకాదరణ రోజురోజుకు పెరుగుతోంది. పద్దెనిమిదేళ్ళకు మించిన వయస్కులనే పరిగణనలోకి తీసుకుంటే 32.5 కోట్ల మందిగా లెక్కతేలారు. ప్రధానంగా ప్రాంతీయ భాషల్లో వీడియోలను చూసే విషయంలో యూట్యూబ్‌ టాప్‌లో ఉంది. భిన్న కేటగిరిల కథనాలను అందించేవారు కూడా టీవీ తదితరాలతో పోల్చుకుంటే యూట్యూబ్‌కే ఎక్కువగా అంటే 4.8 రెట్లుగా ఉంది.


విలక్షణ ఆసక్తులతో యూట్యూబ్‌లో కంటెంట్‌ను అందించే భారతీయుల సంఖ్య రానురాను పెరుగుతోం దని గూగుల్‌ ఇండియా కంట్రీ హెడ్‌, వైస్‌ ప్రెసి డెంట్‌ సంజయ్‌ గుప్తా వెల్లడించారు. ఈ రోజు యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్న కంటెంట్‌ ప్రాంతాలు, భాషలు, వయస్సులతో సంబంధం లేకుండా భారతదేశంలోని ఒక బిలియన్‌ మేర వ్యూయర్స్‌ ఆసక్తులను ప్రతిబింబిస్తోందని అంచనా. సంఖ్యాపరంగా చూస్తే వరుసగా హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, బెంగాలీ తదితర భాషల వ్యూయర్స్‌ ఎక్కువగా ఉన్నారు.   

2500కి మించి ఉన్న క్రియేటర్‌ ఛానల్స్‌కు పదిలక్షలకు మించి సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు. గత ఏడాది జూలై నెలతో పోలిస్తే ఈ సంవత్సరం ఇదే మాసంతో పోల్చినప్పుడు యూట్యూబ్‌ చూసేవారి సంఖ్య 45 శాతం మేర పెరిగింది. అలాగే గేమింగ్‌ వీడియోలు చూసేవారి సంఖ్య రెండు రెట్లు, వంటల వీడియోలను చూసేవారి సంఖ్య మూడు రెట్లు పెరిగింది. అలాగే భారత దేశంలో లెర్నింగ్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా యూట్యూబ్‌ నిలుస్తోంది. ప్రస్తుతం ఇంటర్నెట్‌ ద్వారా విద్యనభ్యసించేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది.


Updated Date - 2020-10-31T06:34:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising