ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాళ్ల సమస్య ... వీళ్లకి అవకాశం!

ABN, First Publish Date - 2020-03-14T00:52:29+05:30

విండోస్‌ 10 వాడుతున్నవాళ్లకి - ఈ మధ్య నరకం అన్న పదాన్ని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదేమో!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విండోస్‌ 10 వాడుతున్నవాళ్లకి - ఈ మధ్య నరకం అన్న పదాన్ని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదేమో! నిత్యం విసిగించే అప్‌డేట్స్‌తో, ఎన్ని అప్‌డేట్స్‌ చేసినా ఆగని సమస్యలతో - విండోస్‌ 10 ఈ మధ్య యూజర్ల సహనానికి పరీక్ష పెడుతోంది. మాటి మాటికీ అప్‌డేట్‌... ఎన్నిసార్లు అప్‌డేట్‌ చేసినా రిసోర్సులు అవుట్‌! ఇదీ విండోస్‌ పరిస్థితి!

మరి దీన్ని ఎవరు క్యాష్‌ చేసుకుంటున్నారో తెలుసా?


విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ వాడేవాళ్లే కాదు.. ఏ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ వాడేవాళ్లయినా ఫైల్స్‌ సెర్చ్‌ చేయాలంటే - ఫైల్సన్నీ ఎప్పటికప్పుడు ఇండెక్స్‌ అవుతూ ఉండాలి. కంప్యూటర్లో నిత్యం కొత్త ఫైల్స్‌ తయారవుతూ ఉంటాయి. మరి కొత్త ఫైల్స్‌ ఇండెక్స్‌ చేసే ప్రాసెస్‌లోనే సమస్య వస్తోంది. మైక్రోసాఫ్ట్‌ వాయిస్‌ అసిస్టెంట్‌ అయిన 'కోర్టానా' ఈ ఇండెక్సింగ్‌ సమయంలో హార్డ్‌డిస్క్‌ 'మొత్తాన్ని' ఉపయోగించుకుంటోంది. 100% Disk Usage అని చూపించే ఈ సమయంలో కంప్యూటర్‌ పనితీరు భయంకరంగా స్లో అయిపోతోంది. ఈ విషయాన్ని సరిచేయడానికే నిత్యం కొత్త అప్‌డేట్స్‌ తీసుకువస్తోంది విండోస్‌ 10. కానీ ఎన్నిసార్లు అప్‌డేట్స్‌ చేసినా డిస్క్‌ రిసోర్స్‌, సిస్టమ్‌ స్లో అనేవి సమస్యలుగానే మిగిలిపోతున్నాయి.


అయితే - ఈ మధ్య ఈ అర్థం లేని అప్‌డేట్స్‌ కారణంగా విండోస్‌ ప్రతిష్ఠ కాస్త డౌన్‌ అవడం చూసిన గూగుల్‌ తన క్రోమ్‌ బుక్స్‌ని ప్రమోట్‌ చేయడానికి ఇదే అదనుగా భావిస్తోంది. 'గూగుల్‌ పిక్సెల్‌ బుక్‌ గో' లాంటి నోట్‌ బుక్‌ కంప్యూటర్లని ఎక్కువగా ప్రమోట్‌ చేస్తోంది. నిజానికి గూగుల్‌ క్రోమ్‌ ఓఎస్‌ అన్నది ఓ అట్టర్‌ఫ్లాప్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ అని చెప్పాల్సి ఉంటుంది. విండోస్‌తో పోలిస్తే - దీనికి డిమాండ్‌ లేనే లేదు. కానీ ఏం చేస్తాం? వ్యాపారాత్మకమైన ప్రపంచంలో - ఒకోసారి ఒకరి సమస్యని మరొకరు అవకాశంగా మలచుకుని ఎదగాలని ప్రయత్నించడం సహజంగా జరిగేదే!

Updated Date - 2020-03-14T00:52:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising