ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండుసార్లు మడత పెట్టగల వింత ఫోన్‌!

ABN, First Publish Date - 2020-03-06T23:06:59+05:30

ఫోల్డింగ్‌ ఫోన్‌ అంటే అసలేంటటి? మధ్యకి ఓసారి మడత పెట్టగలిగే ఫోన్‌. అంతే కదా? ఇప్పటివరకైతే మన డెఫినిషన్‌ ఇంతే. కానీ సరిగ్గా, కొత్తగా ఆలోచించండి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫోల్డింగ్‌ ఫోన్‌ అంటే అసలేంటటి? మధ్యకి ఓసారి మడత పెట్టగలిగే ఫోన్‌. అంతే కదా? ఇప్పటివరకైతే మన డెఫినిషన్‌ ఇంతే. కానీ సరిగ్గా, కొత్తగా ఆలోచించండి. ఫోన్‌ని ఒక్కసారే ఎందుకు మడత పెట్టాలి? మధ్యలోనే ఎందుకు మడత పెట్టాలి? పక్కకి మడత పెడితే మరోసారి మడత పెట్టే అవకాశం ఉంటుందిగా? ఫోన్‌ని రెండు సార్లు మడత పెడితే తప్పు కాదుగా? అలా చేస్తే - ఉన్న అదే స్పేస్‌లో మరింత పెద్ద స్క్రీన్‌ ఇమడ్చవచ్చు కదా?

- టీసీఎల్‌ వాళ్లు ఆలోచించింది అచ్చం ఇలాగే!


ఇటీవల చైనీస్‌ టెక్‌ కంపెనీ టీసీఎల్ ‌( TCL ) కంపెనీ రెండు కాన్సెప్ట్‌ ఫోన్లను ప్రకటించింది. వాటిలో ఒకటి ఈ రెండు మడతల ఫోన్‌. 6.65 అంగుళాల స్క్రీన్‌ ఉండే ఈ ఫోన్‌ని రెండుసార్లు మడత పెట్టవచ్చు. ఫుల్‌గా స్క్రీన్‌ తెరిస్తే అది ఒక 10 అంగుళాల టాబ్లెట్‌గా మారిపోతుంది! స్మార్ట్‌ఫోన్‌నీ, టాబ్లెట్‌నీ ఏకకాలంలో అందించే ఈ ఐడియా బాగుంది కదూ?


ప్రస్తుతానికి ఇంకా ఈ రెండు మడతల ఫోన్‌ బయటకి రాలేదు. ఇంకా ఇది కాన్సెప్ట్‌ స్థాయిలోనే ఉంది. అయితే ఇది సక్సెస్‌ అయితే ఫ్యూచర్లో హ్యువావీ, శామ్‌సంగ్‌ లాంటి బ్రాండ్లు రిలీజ్‌ చేసే ఫోల్డబుల్‌ ఫోన్లకి గట్టి కాంపిటీషన్‌ ఇస్తుందని అంటున్నారు. నిజమే! ఇచ్చినా ఇవ్వచ్చు. పాకెట్లో పెద్ద స్క్రీన్‌ పట్టేస్తుందంటే - జనం ఇష్టపడకుండా ఉంటారా?

Updated Date - 2020-03-06T23:06:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising