ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైరస్‌ ఆగిపోవాలంటే ముందు వాటిని ఆపాలి!

ABN, First Publish Date - 2020-03-05T01:52:08+05:30

కరోనా వైరస్‌ లాంటివి చరిత్రలో ఎన్నెన్నో వచ్చాయి. అయితే ప్రమాదకరమైన ఇలాంటివి పాకుతున్నాయని తెలిసినప్పుడు - జనం భయపడడం సహజం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా వైరస్‌ లాంటివి చరిత్రలో ఎన్నెన్నో వచ్చాయి. అయితే ప్రమాదకరమైన ఇలాంటివి పాకుతున్నాయని తెలిసినప్పుడు - జనం భయపడడం సహజం. కానీ మీడియా పెరిగిపోయిన ఈ కాలంలో ఎవరెవరో ఏదేదో మాట్లాడేయడం, రాసేయడం, వాటిని వినీ చదివీ జనం మామూలు కంటే మరింత భయపడడం జరుగుతోంది.


వ్యాధుల విషయంలో కేవలం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది చెబితే చాలు. కానీ క్లిష్ట సమయాల్లో జనానికి సాయం చేసి ధైర్యం అందించాల్సింది పోయి కొందరు స్వప్రయోజనార్థం, లేదా వినోదం కోసం కొన్ని పుకార్లు కూడా వ్యాప్తి చేస్తుంటారు. ఇంటర్‌నెట్‌ ద్వారా అవి చదివిన జనం కలవరపడి మనశ్శాంతిని కోల్పోతుంటారు. ఇలాంటి ప్రమాదం ఏర్పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? కీవర్డ్స్‌ని బ్లాక్‌ చేయాలి. అప్పుడే జనం వాటి గురించి అనవసరం గా చదివి ఎక్కువ కలవరానికి గురి కాకుండా ఉంటారు.


అందుకే - ఇప్పుడు చాట్‌ యాప్స్‌ కొన్ని కరోనా వైరస్‌కి సంబంధించిన కీవర్డ్స్‌ని బ్లాక్‌ చేస్తున్నాయి. ఉదాహరణకి వి చాట్‌ (We Chat) సాఫ్ట్‌వేర్‌ కరోనా వైరస్‌కి సంబంధించిన కీవర్డ్స్‌ని సెన్సార్‌ చేసి బ్లాక్‌ చేస్తోంది. ఎందుకంటే రోగం అనే వైరస్‌ కంటే పుకారు అనే వైరస్‌ ఇంకా ప్రమాదకరం. వెరీ గుడ్ వి చాట్‌... వెల్‌ డన్‌!

Updated Date - 2020-03-05T01:52:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising