ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిరికైనా గూగుల్‌కైనా ఈ ఇయర్‌ఫోన్సే కరెక్ట్‌!

ABN, First Publish Date - 2020-03-07T00:30:13+05:30

గతంలో కంటే ఈ మధ్య జనంలో ఇయర్‌ ఫోన్స్‌ వాడకం ఎక్కువయింది. అయితే వైర్డ్‌ ఇయర్‌ఫోన్స్‌ వాడేటప్పుడు ఫోన్‌ని ఎక్కువ స్వేచ్ఛగా కదిపే అవకాశం ఉండదు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గతంలో కంటే ఈ మధ్య జనంలో ఇయర్‌ ఫోన్స్‌ వాడకం ఎక్కువయింది. అయితే వైర్డ్‌ ఇయర్‌ఫోన్స్‌ వాడేటప్పుడు ఫోన్‌ని ఎక్కువ స్వేచ్ఛగా కదిపే అవకాశం ఉండదు, పైగా ఇయర్‌ ఫోన్స్‌ ఎక్కడ చెవిలోంచి ఊడిపోతాయో అని ఇటూ అటూ కదలడం కూడా ఇబ్బందే. అందుకే ఈ మధ్య - కాస్త కాస్ట్‌ ఎక్కువైనా బ్లూటూత్‌ టెక్నాలజీతో పనిచేసే వైర్‌లెస్‌ ఇయర్‌ఫోన్స్‌కి డిమాండ్‌ బాగా పెరిగింది.


అద్భుతమైన ఆడియో డివైజెస్‌ తయారుచేసే జర్మన్‌ ఆడియో బ్రాండ్‌ సెన్‌హైజర్‌  (Sennheiser) తాజాగా CX 150BT, CX 350BT అనే రెండు కొత్త వైర్‌లెస్‌ ఇయర్‌ ఫోన్లు విడుదల చేసింది. పది గంటల బ్యాటరీ లైఫ్‌ కలిగి ఉండే ఈ ఇయర్‌ ఫోన్స్‌ బ్లూ టూత్‌ వెర్షన్‌ 5.0 తో పనిచేస్తాయి. హే సిరి, ఓకే గూగుల్‌ అంటూ... సిరి, గూగుల్‌ అసిస్టెంట్‌ లాంటి వాయిస్‌ అసిస్టెంట్లతో పని చేయించుకోవడం ఈ మధ్య మామూలైపోయింది. అందుకే తాజాగా వస్తున్న అన్ని మంచి ఇయర్‌ ఫోన్స్‌లోనూ వాయిస్‌ అసిస్టెంట్స్‌ కోసం ఓ  డెడికేటెడ్‌ బటన్‌ పెడుతున్నారు. ఈ సెన్‌హైజర్‌ వైర్‌లెస్‌ ఇయర్‌ఫోన్స్‌ రెండు మోడల్స్‌ లోనూ ఈ డెడికేటెడ్‌ బటన్‌ ఉంది. వాయిస్‌ ఆధారంగా పనులు చేయించుకోవడానికీ, పర్సనలైజ్‌డ్‌ సౌండ్‌ ద్వారా ఫోన్‌ని సులువుగా కంట్రోల్‌ చేయడానికీ ఈ బటన్‌ పనికొస్తుంది.

ఈ వైర్‌లెస్‌ ఇయర్‌ఫోన్స్‌ రేట్లు దాదాపు ఇలా ఉన్నాయి :

Sennheiser CX 150BT రూ. 4990

Sennheiser CX 350BT రూ.7490

Updated Date - 2020-03-07T00:30:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising