ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరోగ్యకరమైన స్మార్ట్‌ వాచ్‌!

ABN, First Publish Date - 2020-02-29T00:33:16+05:30

యాపిల్‌ వాచ్‌ తయారయిన తరవాత - స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీల వాళ్లంతా స్మార్ట్‌ వాచ్‌ల తయారీ కూడా మొదలుపెట్టారు. స్మార్ట్‌ ఫోన్‌తో లింకవుతూ - మరో చిన్న ఫోన్‌ మాదిరిగా పనిచేస్తూ - మణికట్టు మీదనుంచే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాపిల్‌ వాచ్‌ తయారయిన తరవాత - స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీల వాళ్లంతా స్మార్ట్‌ వాచ్‌ల తయారీ కూడా మొదలుపెట్టారు. స్మార్ట్‌ ఫోన్‌తో లింకవుతూ - మరో చిన్న ఫోన్‌ మాదిరిగా పనిచేస్తూ - మణికట్టు మీదనుంచే మన జీవితానికి హెల్ప్‌ చేసే స్మార్ట్‌ వాచీలు - క్రేజీ డివైజెస్‌ గా మారాయి. వీటిలో ఆరోగ్యపరమైన అంశాలు కలిపి ఫిట్‌నెస్‌ డివైజెస్‌గా కూడా వీటిని మార్చడం పరిపాటి అయింది. అయితే స్మార్ట్‌ వాచ్‌ల ధరలు ఇప్పటికీ ఎక్కువే అని చెప్పాలి. అయినా స్మార్ట్‌ ఫోన్‌ తో బాటు ఓ కంపాటిబుల్‌ స్మార్ట్‌ వాచ్‌ ఉంటే - ఆ మజాయే వేరు. ఇది గ్రహించిన జనం స్మార్ట్‌ వాచ్‌లు కూడా కొంటున్నారు. అయితే ఈ మార్కెట్ గుర్తించిన వాచ్‌ కంపెనీలు కూడా ఇప్పుడు స్మార్ట్‌ వాచ్‌ల తయారీకి మొగ్గు చూపుతున్నాయి. డిజిటల్‌ వాచ్‌లకి క్రేజ్‌ పెరిగిన ఈ రోజుల్లో  వాచ్‌ ఎంత స్టయిలిష్‌ గా ఉన్నా - పూర్వకాలం నాటి రెండు ముళ్లూ మూడు ముళ్లూ కలిగిన వాచ్‌లు ఎవరూ కొనడం లేదు. ఇప్పుడు వాచ్‌ కేవలం డిజిటల్‌ అయితే సరిపోదు. స్మార్ట్‌ కూడా కావాలి. ఈ సత్యాన్ని గ్రహించిన టైమెక్స్‌ ( TIMEX) లాంటి పెద్ద పెద్ద వాచ్‌ కంపెనీలు స్మార్ట్‌ వాచీలు రూపొందించడంలో నిమగ్నం అయ్యాయి.


టైమెక్స్‌ కంపెనీ ఇటీవీల R300 GPS అనే వాచ్‌ తయారు చేసింది. అయితే టైమెక్స్‌ గతంలో చేసిన స్మార్ట్‌ వాచీల మాదిరిగానే .. దీంట్లో ఫిట్‌ నెస్‌ ఫీచర్లు ఎక్కువ. కాబట్టి ఫిట్‌నెస్‌ బ్యాండ్‌ మాదిరిగా వాడుకోవాలనుకునేవాళ్లే దీనిని ప్రిఫర్‌ చేయాల్సి ఉంటుంది. ముప్ఫై మీటర్ల లోతు నీటిలో కూడా ఈ వాచ్‌ పనిచేస్తుంది. దీని బ్యాటరీ కెపాసిటీ దాదాపు 25 రోజులట. కాబట్టి దాదాపు నెలరోజులు దీన్ని ఛార్జ్‌ చేయకుండా వాడుకోవచ్చు. అయితే జీపీఎస్‌ ఎక్కువగా వాడితే బ్యాటరీ 20 రోజులే వస్తుంది. ఈ R300 GPS వాచ్‌ ఖరీదు 120 డాలర్లని చెబుతున్నారు. మన కరెన్సీలో చెప్పాలంటే - దాదాపు 8,500 రూపాయలనుకోవచ్చు.

Updated Date - 2020-02-29T00:33:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising