ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాంటీవైరస్‌ అవసరమా?

ABN, First Publish Date - 2020-08-29T05:30:00+05:30

నేను ఫోన్లో కొంత ఆఫీసు పని చేసుకుంటాను. అలాగే ఫైనాన్షియల్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేను ఫోన్లో కొంత ఆఫీసు పని చేసుకుంటాను. అలాగే ఫైనాన్షియల్‌ ట్రాన్సాక్షన్స్‌ కోసం కూడా వాడతాను. ఇందుకోసం యాంటీవైరస్‌ వేసుకోవడం అవసరమా, లేకుంటే డిఫాల్ట్‌గా ఆపరేటింగ్‌ సిస్టంతో వస్తుందా?          

 - రమణ

ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టంలో ప్రధానంగా దృష్టి సారించవలసింది మీరు ఫోన్లో ఇన్స్టాల్‌ చేసుకునే అప్లికేషన్ల గురించి మాత్రమే. గూగుల్‌ ప్లే స్టోర్‌ నుండి మీరు యాప్స్‌ డౌన్లోడ్‌ చేసినంతకాలం పెద్దగా ఎలాంటి ప్రమాదం ఉండదు. ఇతర ప్రదేశాల నుంచి డౌన్లోడ్‌ చేసి సైడ్‌లోడ్‌ చేసినప్పుడు మాత్రమే ఈ ఫోన్‌లో డేటా, ఫైనాన్షియల్‌ అప్లికేషన్స్‌ ప్రమాదంలో పడతాయి. మీరు భావించినట్టు ఒక యాంటీవైరస్‌ అప్లికేషన్‌ ఇన్స్టాల్‌ చేసుకుంటే అది పూర్తిగా మీకు రక్షణ కల్పించడం అసాధ్యం.


విండోస్‌ కంప్యూటర్లలో మాదిరిగా యాంటీవైరస్‌ల ద్వారా ఆండ్రాయిడ్‌కి పూర్తి రక్షణ లభించదు. మీ బ్రౌజింగ్‌ అలవాట్లు, మీరు క్లిక్‌ చేసే లింకులు, మీరు ఫోన్లో ఇన్స్టాల్‌ చేసుకునే యాప్స్‌ వంటి వివిధ అంశాలపై సెక్యూరిటీ ఆధారపడి ఉంటుంది. ఆండ్రాయిడ్‌ ఫోన్లలో ప్రత్యేకంగా యాంటీవైరస్‌ అవసరం లేదు. అంతర్గతంగానే ‘‘గూగుల్‌ ప్లే ప్రొటెక్ట్‌’’ అనే ప్రత్యేకమైన సదుపాయం ఉంటుంది. అది కొంతవరకు రక్షణ కల్పిస్తుంది. యాంటీ వైరస్‌పై భారం వేయడం కన్నా సెక్యూరిటీపై అవగాహన పెంచుకోవటం, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం.


Updated Date - 2020-08-29T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising