ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైర్‌లెస్‌ పరికరాన్ని సృష్టించిన ఎంఐటీ

ABN, First Publish Date - 2020-04-17T19:01:21+05:30

అమెరికాలోని మసాచుసెట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంఐటీ)కి చెందిన కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజన్స్‌ ల్యాబొరేటరీ నిపుణులు మరో అడుగు ముందుకేసి ఎమరాల్డ్‌ అనే వైర్‌లెస్‌ పరికరాన్ని కనుక్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమెరికాలోని మసాచుసెట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంఐటీ)కి చెందిన కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజన్స్‌ ల్యాబొరేటరీ నిపుణులు మరో అడుగు ముందుకేసి ఎమరాల్డ్‌ అనే వైర్‌లెస్‌ పరికరాన్ని కనుక్కొన్నారు. ఈ పరికరంతో వైద్యులు దూరం నుంచే రోగులను పరీక్షించవచ్చు. రోగుల శ్వాస తీరును, కదలికలను, నిద్రపోతున్న తీరును వైర్‌లెస్‌ సిగ్నల్స్‌ ఆధారంగా ఈ పరికరం పర్యవేక్షిస్తుంది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజన్స్‌ టెక్నాలజీ ఆధారంగా ఇది పనిచేస్తుంది. బోస్టల్‌లోని వైద్యబృందం ఈ పరికరాన్ని ప్రయోగాత్మకంగా ఉపయోగించింది. వైద్యులు ఇంటి వద్దనుంచే రోగిని పరిశీలించారు. వైర్‌లెస్‌ పరికరం అందించిన సమాచారం ఆధారంగా రోగి శ్వాస రేటు తగ్గి సాధారణ స్థాయికి వచ్చినట్టు గుర్తించారు. నిద్ర కూడా మెరుగుపడినట్టు తెలుసుకున్నారు. ఇతర శ్వాస సంబంధ సమస్యలను  ఈ వైర్‌లెస్‌ పరికరం గుర్తించగలదు. రోగులను భౌతికంగా కలవడం, మాట్లాడే అవసరం ఉండదు కాబట్టి వైద్యులకు కరోనా సోకకుండా ఈ పరికరం ఉపయోగపడగలదని భావిస్తున్నారు.

Updated Date - 2020-04-17T19:01:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising