ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హెచ్‌ఏఎల్‌ ఏరోసాల్‌ బాక్సుల తయారీ

ABN, First Publish Date - 2020-04-17T18:59:48+05:30

కరోనాపై పోరాటంలో ముందువరుసలో నిలబడి యుద్ధం చేస్తున్న వైద్య సిబ్బంది రక్షణకు శాస్త్రవేత్తలు తమవంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు, న్యూయార్క్: కరోనాపై పోరాటంలో ముందువరుసలో నిలబడి యుద్ధం చేస్తున్న వైద్య సిబ్బంది రక్షణకు శాస్త్రవేత్తలు తమవంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. తాజాగా భారత ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌ - హాల్‌), అమెరికాకు చెందిన ఎంఐటీ పరిశోధకులు రెండు కొత్త పరికరాలను తయారుచేశారు. బెంగళూరులోని హాల్‌... ఏరోసాల్‌ బాక్స్‌లను తయారుచేసింది. ఆసుపత్రుల్లో ఈ ఏరోసాల్‌ స్ర్పే చల్లడం ద్వారా దీని నుంచి వెలువడే రేణువులు లేదా లిక్విడ్‌ డ్రాప్‌లెట్ల వల్ల కరోనా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు. డాక్టర్లు, రోగుల మధ్య ఇన్సులేటర్‌ మాదిరిగా ఇది పనిచేస్తుంది. తద్వారా రోగుల నుంచి వైద్యులకు వైరస్‌ సోకే అవకాశం తగ్గుతుందని హాల్‌ ఛైర్మన్‌ ఆర్‌. మాధవన్‌ తెలిపారు. హాల్‌ ఇప్పటికే 300 ఏరోసాల్‌ బాక్సులను తయారుచేసి ఆరు రాష్ట్రాలకు పంపించింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వీటిని ఉపయోగిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న హాల్‌ ఉత్పత్తి కేంద్రాల్లో వీటిని తయారుచేస్తున్నారు. ఫలితాలను బట్టి మరిన్ని ఏరోసాల్‌ బాక్సులు తయారుచేసి అన్ని రాష్ట్రాలకు పంపిస్తామని మాధవన్‌ తెలిపారు. 

Updated Date - 2020-04-17T18:59:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising