ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైరస్‌ని గుర్తించడం ఎలా?

ABN, First Publish Date - 2020-09-12T05:30:00+05:30

ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఆధారంగా పనిచేసే ఫోన్లలో గూగుల్‌ సంస్థకు చెందిన గూగుల్‌ ప్లే ప్రొటెక్ట్‌ అనే సర్వీస్‌ నిరంతరం బ్యాక్‌గ్రౌండ్‌లో రన్‌ అవుతూ ఉంటుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక స్మార్ట్‌ ఫోన్‌లో వైరస్‌ ఉంది అన్న విషయం ఎలా గుర్తించాలి. అలాగే మన ఫోన్‌ హ్యాక్‌ అయిందన్న విషయం తెలుసుకోవడం ఎలా, యాంటీ వైరస్‌ సాఫ్ట్‌వేర్లు సురక్షితంగా ఉంటాయా?      

- శ్రీనివాస్‌


ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఆధారంగా పనిచేసే ఫోన్లలో గూగుల్‌ సంస్థకు చెందిన గూగుల్‌ ప్లే ప్రొటెక్ట్‌ అనే సర్వీస్‌ నిరంతరం బ్యాక్‌గ్రౌండ్‌లో రన్‌ అవుతూ ఉంటుంది. అది మీ ఫోన్లో ఉండే ప్రమాదకరమైన అప్లికేషన్లను వీలైనంత వరకు గుర్తించడానికి ప్రయత్నిస్తుంది. అయితే కొంతమంది తాము సైడ్‌లోడ్‌ చేసే ఏపికే ఫైళ్లని ఇది అడ్డుకుంటుంది అన్న కారణంతో దీన్ని డిజేబుల్‌ చేస్తూ ఉంటారు. దాంతో తగినంత రక్షణ లభించదు. మీ ఫోన్‌లో ప్రమాదకరమైన అప్లికేషన్‌ ఉంది అన్న విషయం ఈ గూగుల్‌ ప్లే ప్రొటెక్ట్‌ కొంతవరకు చెబుతుంది. కొన్ని సందర్భాల్లో మీ ఫోన్లో మీరు ఇన్‌స్టాల్‌ చేసుకునే అప్లికేషన్లు కమాండ్‌ కంట్రోల్‌ సర్వర్‌ నుంచి రకరకాల ప్రమాదకరమైన మాడ్యూల్స్‌ వాటంతటవే డౌన్లోడ్‌ చేస్తూ ప్రమాదం కల్పిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఆ విషయాన్ని గుర్తించడం చాలా కష్టం. కేవలం యాంటీవైరస్‌ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవడం ద్వారా పూర్తిస్థాయిలో రక్షణ లభిస్తుంది అనేది అపోహ మాత్రమే. మీ ఫోన్లో చీటికి మాటికి అడ్వర్టయిజ్‌మెంట్స్‌ కనిపిస్తూ, చాలా వేగంగా ఫోన్‌ బ్యాటరీ ఖాళీ అవుతుంటే అందులో మాల్వేర్‌ ఉన్నట్లు భావించాలి. అలాగే ఫోన్‌ హ్యాక్‌ అయినప్పుడు కూడా దాదాపు ఇదే విధమైన లక్షణాలు ఉంటాయి. కాబట్టి, అనుమానం వచ్చినప్పుడు ఫ్యాక్టరీ రీసెట్‌ చేయటం అన్నింటికంటే ఉత్తమమైన పద్థతి.

Updated Date - 2020-09-12T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising