ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫైళ్లు, ఫోన్‌ నెంబర్ల డిలీట్‌ ఎలా?

ABN, First Publish Date - 2020-09-26T05:59:59+05:30

వాస్తవానికి మీ కంప్యూటర్‌ లేదా ఫోన్‌ నుంచి మీరు డిలీట్‌ చేసే డేటా మొత్తాన్ని శక్తిమంతమైన డేటా రికవరీ సాఫ్ట్‌వేర్‌లు లేదంటే డేటాని రిట్రీవ్‌ చేసే హార్డ్‌వేర్‌ పరికరాల సహాయంతో రికవర్‌ చేయవచ్చు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఫోన్లో, కంప్యూటర్లో శాశ్వతంగా ఫైళ్లను, ఫోన్‌ నెంబర్లను డిలీట్‌ చేయడం ఎలా?
  • - ఎస్‌. శ్రీనివాస్‌


శాశ్వతంగా డిలీట్‌ చేయడం అంటూ ఏమీ ఉండదు. వాస్తవానికి మీ కంప్యూటర్‌ లేదా ఫోన్‌ నుంచి మీరు డిలీట్‌ చేసే డేటా మొత్తాన్ని శక్తిమంతమైన డేటా రికవరీ సాఫ్ట్‌వేర్‌లు లేదంటే డేటాని రిట్రీవ్‌ చేసే హార్డ్‌వేర్‌ పరికరాల సహాయంతో రికవర్‌ చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో డిలీట్‌ చేసిన డేటా స్థానంలో కొన్ని జీరో ఫిల్లింగ్‌ అప్లికేషన్లని ఉపయోగించి, అందులో డేటా తిరిగి వెనక్కి రాకుండా ఉండేలా మళ్లీ మళ్లీ జీరో బైట్స్‌ నింపుతూ ఉంటారు. అలాంటి సందర్భాల్లోనూ మామూలు వ్యక్తుల డేటా రికవర్‌ చేయలేరు. అయితే, ఏదైనా కీలకమైన కేసు విషయంలో సైబర్‌ ఫోరెన్సిక్‌ విభాగంవారు అలా పోయిన డేటాను వెనక్కు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. డేటాను క్లౌడ్‌ స్టోరేజ్‌లో భద్రపరిచి ఉంటే గనుక, మీరు అక్కడ నుంచి డిలీట్‌ చేసినా కూడా, ఒక నిర్దిష్టమైన కాలపరిమితి లోపల పోలీస్‌ విభాగంవారు సంబంధిత క్లౌడ్‌ స్టోరేజ్‌ సర్వీస్‌ సమన్వయంతో డిలీట్‌ చేసిన డేటాని వెనక్కి తీసుకురాగలుగుతారు. కాబట్టి డేటాను శాశ్వతంగా డిలీట్‌ చేయడం అనేది కేవలం ఒట్టి భ్రమ మాత్రమే.


Updated Date - 2020-09-26T05:59:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising