ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గొరిల్లా గ్లాస్‌ అంటే?

ABN, First Publish Date - 2020-10-31T06:36:59+05:30

ఫోన్‌ స్ర్కీన్‌లు డామేజ్‌ కాకుండా రక్షించడం కోసం కార్నింగ్‌ అనే సంస్థ ప్రత్యేకంగా తయారు చేసిన గ్లాస్‌నే గొరిల్లా గ్లాస్‌ అంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చాలా ఫోన్లలో గొరిల్లా గ్లాస్‌ ఉంది అని చెప్తారు కదా, దాని గురించి వివరంగా తెలుపగలరు? 

- విశాల్‌, విజయవాడ

ఫోన్‌ స్ర్కీన్‌లు డామేజ్‌ కాకుండా రక్షించడం కోసం కార్నింగ్‌ అనే సంస్థ ప్రత్యేకంగా తయారు చేసిన గ్లాస్‌నే గొరిల్లా గ్లాస్‌ అంటారు. వేలాది రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన ఫోన్లను జేబులో పెట్టుకున్నప్పుడు కీచెయిన్ల లాంటివీ, కాయిన్ల లాంటివీ తగిలి గీతలు పడితే ప్రాణం చివుక్కుమంటుంది కదా. అంతేకాదు, పొరబాటున టేబుల్‌ మీద నుంచి ఫోన్‌ కింద పడితే స్ర్కీన్‌ పాడయ్యే అవకాశం ఉంది. అలాంటి ప్రమాదాలను తప్పించడానికి ఈ ప్రత్యేకమైన గ్లాస్‌ ఉపయోగపడుతుంది.

ఉదాహరణకు ఇటీవల ప్రవేశపెట్టిన గొరిల్లా గ్లాస్‌ 5నే తీసుకుంటే 1.6 మీటర్ల ఎత్తు నుంచి ఫోన్‌ని కింద పడేసినా చెక్కుచెదరకుండా ఇది కాపాడుతుంది. అనేక రకాల శక్తిమంతమైన పరీక్షలు చేసిన తరవాత మాత్రమే కార్నింగ్‌ సంస్థ దీన్ని తయారు చేస్తోంది. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు, టెలివిజన్‌ స్ర్కీన్లలో దీన్ని ఎక్కువగా వాడుతున్నారు.


మీ టెక్‌ సందేహాలకు సమాధానాల కోసం  ుnavya@andhrajyothy.com

Updated Date - 2020-10-31T06:36:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising