ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏప్రిల్ 6 నుంచి గూగుల్ రచ్చ!

ABN, First Publish Date - 2020-02-11T23:04:57+05:30

గూగుల్ ఇప్పటికే ఎన్నో రకాల సర్వీసులతో ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయింది. అయితే ఇప్పటికీ గూగుల్‌ క్లౌడ్‌ సర్వీసులని సమర్థంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గూగుల్ ఇప్పటికే ఎన్నో రకాల సర్వీసులతో ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయింది. అయితే ఇప్పటికీ గూగుల్‌ క్లౌడ్‌ సర్వీసులని సమర్థంగా ప్రభావశీలంగా వాడుకునే కస్టమర్లు చాలా తక్కువ. అమెజాన్ మైక్రోసాఫ్ట్‌.. ఇలా పెద్ద పెద్ద సంస్థలన్నీ ఇప్పుడు క్లౌడ్ సర్వీసులతో విజయాలు చూస్తున్నాయి. అయితే ఎంతో పెద్ద నెట్‌వర్క్ అయిన గూగుల్ మాత్రం తన cloud మాత్రం తాను అనుకున్నంతగా అభివృద్ధి చెందలేదు అన్న అభిప్రాయంలో ఉంది. 


ప్రపంచం మొత్తం జీమెయిల్‌తో లింక్‌ అయి ఉన్న ఈ రోజుల్లో - మెయిల్స్‌ స్టోర్‌ చేసుకోవడానికి, ఫోటోలు దాచుకోవడానికి గూగుల్ కస్టమర్లు అంతా తమకు తెలియకుండానే గూగుల్ వాడుతుంటారు. అయితే క్లౌడ్‌ అనేదాన్ని పూర్తి స్థాయిలో ఎవరూ వినియోగించుకోవడం లేదని చెప్పాల్సి ఉంటుంది. అందుకే ఇప్పుడు క్లౌడ్‌ సర్వీస్ లో ఒక కొత్తదనాన్ని తీసుకువచ్చి ఎక్కువ గా జనానికి చేరువ కావడం కోసం ఇప్పుడు గూగుల్‌ క్లౌడ్‌ నెక్స్ట్‌ అంటూ క్లౌడ్‌ కొత్త వెర్షన్‌కి తెరతీసింది గూగుల్. ఇందుకోసం జనానికి గూగుల్ క్లౌడ్‌ ని చేరువ చేసే ఉద్దేశంతో  ఏప్రిల్‌ ప్రారంభంలో - శాన్ఫ్రాన్సిస్కోలో ఇంటరాక్టివ్ మీట్ ఏర్పాటు చేయబోతున్నారు గూగుల్‌ వాళ్లు. ఏప్రిల్ 6 నుంచి 8 వరకు మూడు రోజుల పాటు జరగబోయే ఈ సమావేశం తరవాత మరి గూగుల్కి ఎన్ని కొత్త అవతారాలు ఎత్తుతుందో వేచిచూడాలి మరి!!!

Updated Date - 2020-02-11T23:04:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising