ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అరె! పవర్‌ బ్యాంక్‌ కొంటే ఇవి కూడా లభిస్తాయా?!

ABN, First Publish Date - 2020-02-22T02:27:55+05:30

స్మార్ట్‌ఫోన్‌తో బాటే చాలామంది పవర్‌ బ్యాంక్‌ల్ని కూడా వెంట ఉంచుకుంటూ ఉంటారు. పవర్‌ బ్యాంక్‌ పవరేంటో ముఖ్యంగా ప్రయాణాల్లోనే అర్థమవుతుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్మార్ట్‌ఫోన్‌తో బాటే చాలామంది పవర్‌ బ్యాంక్‌ల్ని కూడా వెంట ఉంచుకుంటూ ఉంటారు. పవర్‌ బ్యాంక్‌ పవరేంటో ముఖ్యంగా ప్రయాణాల్లోనే అర్థమవుతుంది. ఇప్పుడు 10000 maH నుంచి 30000 maH వరకూ ఎన్నో కెపాసిటీల్లో పవర్‌ బ్యాంకులు లభిస్తున్నాయి. అయితే టోరెటో కంపెనీనుంచి వస్తున్న పవర్‌ బ్యాంక్‌ మామూలు పవర్‌ బ్యాంక్‌ల్లాంటిది కాదు.


మామూలుగా మనం ఛార్జర్‌ పవర్‌ బ్యాంక్‌ల్లాంటివి అందుబాటులో ఉన్నా ఒకోసారి కేబుల్ గురించి వెతుక్కుంటూ ఉంటాం. ఎందుకంటే - అన్ని ఫోన్లకీ వైర్‌లెస్‌ ఛార్జింగ్ సదుపాయం ఉండదు. ఛార్జింగ్‌ కేబుల్‌ లేకుండా ఛార్జ్‌ చేయలేం కదా? అయితే టోరెటో పవర్‌ బ్యాంక్‌లో బిల్టిన్‌ కేబుల్స్‌ కూడా ఉంటాయి. ఐఫోన్‌కి సూటయ్యే లైటెనింగ్‌ కేబుల్‌, ఇతర ఫోన్లకి సూటయ్యే టైప్‌ సీ కేబుల్‌, మైక్రో యూఎస్‌బీ కేబుల్‌ - ఇవన్నీ ఈ ఛార్జర్‌తోనే సిద్ధంగా వచ్చేస్తాయి. అందువల్ల కేబుల్‌ గురించి ఇబ్బంది పడాల్సిన పని లేకుండా మనం ఐఫోన్‌ అయినా యాండ్రాయిడ్‌ ఫోన్‌ అయినా వెంటనే ఛార్జ్‌ చేసుకోవచ్చు.


టోరెటోలో చాలా మోడల్స్‌ ఉన్నాయి. అయితే మామూలు పవర్‌ బ్యాంకుల కంటే వీటి ధర కాస్త ఎక్కువ. ఉదాహరణకి - 20000 maH కలిగిన Toreto డ్యాష్‌ ప్రో మోడల్‌ పవర్‌ బ్యాంక్‌ ఖరీదు రూ. 2700. మరి సౌకర్యాన్ని బట్టే రేటు కూడా!


Updated Date - 2020-02-22T02:27:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising