ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నోకియా ఏసీలు వచ్చేశాయ్.. ధర ఎంతంటే..

ABN, First Publish Date - 2020-12-21T22:25:32+05:30

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ కీలక ప్రకటన చేసింది. ప్రముఖ టెలీకమ్యూనికేషన్స్ కంపెనీ నోకియాతో కలిసి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫ్లిప్‌కార్ట్‌లో నోకియా ఎయిర్‌ కండీషనర్స్ వచ్చేశాయ్..

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ కీలక ప్రకటన చేసింది. ప్రముఖ టెలీకమ్యూనికేషన్స్ కంపెనీ నోకియాతో కలిసి సంయుక్తంగా ‘మేడిన్ ఇండియా’ నోకియా ఎయిర్‌ కండిషనర్స్‌ను ఆవిష్కరించింది. నోకియా బ్రాండింగ్‌తో కూడిన ఈ ఏసీలు ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటాయని ఆ సంస్థ తెలిపింది. ఫీచర్ ఫోన్ల మార్కెట్లో అగ్రగామిగా ఓ వెలుగు వెలిగిన నోకియా స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లో వెనుకబడిన సంగతి తెలిసిందే. అయితే.. మార్కెట్లోకి కాస్త ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ నోకియా ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ నెల ఆరంభంలో నోకియా ల్యాప్‌టాప్స్‌ను ఆవిష్కరించింది. గతేడాది నోకియా టీవీలు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. తాజాగా నోకియా ఆవిష్కరించిన ఎయిర్‌ కండీషనర్స్‌ సరికొత్త సాంకేతికతతో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు.


అడ్జస్ట్‌బుల్ ఇన్వర్టర్ మోడ్, ఎన్విరాన్‌మెంట్-ఫ్రెండ్లీ ఆర్-32 రిఫ్రిజ్‌రంట్, ఇంటలిజంట్ మోషన్ సెన్సార్స్, వైఫై కనెక్టెడ్ స్మార్ట్ క్లైమాట్ కంట్రోల్ ఫీచర్లతో నోకియా ఏసీలు వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. స్మార్ట్‌ఫోన్లతో కూడా ఈ ఏసీలను ఆపరేట్ చేయొచ్చని నోకియా తెలిపింది. డిసెంబర్ 29,2020 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో 30,999 రూపాయల నుంచి నోకియా ఏసీలు విక్రయించనున్నారు.

Updated Date - 2020-12-21T22:25:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising