ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాళ్లెవరో తెలుసుకోవచ్చా?

ABN, First Publish Date - 2020-07-18T05:30:00+05:30

నా ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను ఎవరో తెలియని వాళ్ళు లాగిన్‌ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. లాగిన్‌ అవ్వకపోవడంతో ఫర్గెట్‌ పాస్‌వర్డ్‌ క్లిక్‌ చెయ్యడం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నా ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను ఎవరో తెలియని వాళ్ళు లాగిన్‌ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. లాగిన్‌ అవ్వకపోవడంతో ఫర్గెట్‌ పాస్‌వర్డ్‌ క్లిక్‌ చెయ్యడం వల్ల నా మొబైల్‌కి రీసెట్‌ పాస్‌వర్డ్‌ కోడ్‌ వస్తోంది. వాళ్ళు ఎవరో తెలుసుకోవడం ఎలాగో తెలుపగలరు. 

- రమేష్‌ బానోత్‌


వినియోగదారుల అకౌంట్లు హ్యాక్‌ అవ్వకుండా ఫేస్‌బుక్‌ వంటి సంస్థలు అనేక రకాల జాగ్రత్తలు తీసుకుంటాయి. సహజంగా మీ యూజర్‌నేమ్‌ ఎవరైనా చాలా సులభంగా తెలుసుకోగలుగుతారు.  ముఖ్యంగా అధిక శాతం మంది తమ జీమెయిల్‌ యాహూ మెయిల్‌ ఐడీలు యూజర్‌నేమ్‌గా కలిగి ఉంటారు కాబట్టి, దానిని ఎంటర్‌ చేసి,  ఏదో ఒక తప్పుడు పాస్‌వర్డ్‌ ప్రయత్నించి లోపలికి ప్రవేశించాలి అనుకోవడం పెద్ద విషయమేమీ కాదు. అయితే ఇక్కడ మీరు ఏ మాత్రం ఆందోళన చెందాల్సిన పనిలేదు. సులభమైన పాస్‌వర్డ్‌ కాకుండా అక్షరాలు,  సంఖ్యలు, ప్రత్యేక చిహ్నాలతో కూడిన బలమైన పాస్‌వర్డ్‌ గనుక  మీరు ఉపయోగించినట్లయితే ఎలాంటి ప్రమాదం జరగదు. అయితే మీరు అడిగినట్లు,  మీ అకౌంట్లోకి ఎవరు ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారన్న విషయం, వారికి సంబంధించిన ఐపీ అడ్రస్‌ ఫేస్‌బుక్‌ సర్వర్లలో మాత్రమే లాగ్‌ రూపంలో  భద్రపరచి ఉంటుంది. ఫేస్‌బుక్‌ సంస్థ ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ సమాచారాన్ని మనకు షేర్‌ చేయొద్దు. కాబట్టి వారి వివరాలు తెలుసుకునే అవకాశమే లేదు. మీకు మరింత మెరుగైన అకౌంట్‌ సెక్యూరిటీ కావాలంటే 2 - ఫేక్టర్‌ అథంటికేషన్‌ ఎనేబుల్‌ చేసుకుంటే మంచిది.

Updated Date - 2020-07-18T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising