ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెర్షన్‌ అప్‌డెట్‌లో ఆలస్యమేల

ABN, First Publish Date - 2020-09-19T05:30:00+05:30

యాపిల్‌ ఐఫోన్లని, ఆండ్రాయిడ్‌ ఫోన్లని పోల్చి చూసేటప్పుడు అందరూ ఎత్తి చూపించే అతి కీలకమైన అంశం ఇది. యాపిల్‌ సంస్థ తానే హార్డ్‌వేర్‌,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేను ఇప్పటికి మూడు ఆండ్రాయిడ్‌ ఫోన్స్‌ వాడాను. ఏ ఫోన్‌లోనూ కొత్త ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ వెంటనే అప్‌డేట్‌ అవ్వలేదు. ఫోన్‌ కంపెనీలు ఎందుకింత ఆలస్యం చేస్తూ ఉంటాయి? 

- వినోద్‌


యాపిల్‌ ఐఫోన్లని, ఆండ్రాయిడ్‌ ఫోన్లని పోల్చి చూసేటప్పుడు అందరూ ఎత్తి చూపించే అతి కీలకమైన అంశం ఇది. యాపిల్‌ సంస్థ తానే హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ తయారు చేస్తోంది. దాంతో దాని ఐఫోన్లకు ఒకేసారి అప్‌డేట్‌ అందించగలుగుతుంది. అదే ఆండ్రాయిడ్‌ విషయంలో, ఆపరేటింగ్‌ సిస్టమ్‌ని గూగుల్‌ అభివృద్ధి చేస్తుంది. శాంసంగ్‌, వన్‌ప్లస్‌, షామీ వంటి వివిధ కంపెనీలు ఫోన్లను తయారు చేస్తూ ఉంటాయి. ఆ సంస్థలు గూగుల్‌ విడుదల చేసిన ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టం ఉన్నది ఉన్నట్లు తాము విడుదల చేసిన ఫోన్‌లకు అందిస్తే ఎలాంటి ఆలస్యం జరగదు.


అయితే అవి దేనికవి అసలైన ఆండ్రాయిడ్‌లో రూపురేఖలు భిన్నంగా ఉండేలా మార్పులు చేసి, స్వరూపం    మొత్తం మార్చేసి తమ ఫోన్లో నిక్షిప్తం చేస్తూ ఉంటాయి. ఇలా ఎక్కువగా కస్టమైజ్‌ చేసి ఉండటం, గూగుల్‌ సంస్థ కొత్త ఆండ్రాయిడ్‌ వర్షన్‌ విడుదల చేసిన వెంటనే దానిని తమ డిజైనింగ్‌కి తగ్గట్లు కస్టమైజ్‌ చేసి తాము విడుదల చేసిన ఫోన్‌ మోడళ్లకి అందుబాటులోకి తీసుకురావడానికి ఫోన్‌ తయారీ కంపెనీలకు చాలా సమయం పడుతుంది.

అదీకాక అధిక సందర్భాలలో అది కొత్త ఫోన్లను విడుదల చేయటం మీద పెట్టిన శ్రద్ధ ఫోన్‌ అప్‌డేట్‌ విషయంలో పెట్టవు. గూగుల్‌ తాజాగా తీసుకుంటున్న నిర్ణయాల ఫలితంగా మున్ముందు ఈ పరిస్థితిలో మార్పు రావచ్చు.


మీ టెక్‌ సందేహాలకు సమాధానాల కోసం navya@andhrajyothy.com

Updated Date - 2020-09-19T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising