ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గూగుల్‌ మ్యాప్‌లో కొవిడ్‌ సమాచారం

ABN, First Publish Date - 2020-06-13T06:00:19+05:30

రెండు నెలల లాక్‌డౌన్‌ తరువాత ప్రజలు తిరిగి రోడ్లపైకి వస్తున్నారు. భౌతికదూరం పాటిస్తూ తమ పనుల్లో బిజీ అవుతున్నారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు గూగుల్‌ ఓ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రెండు నెలల లాక్‌డౌన్‌ తరువాత ప్రజలు తిరిగి రోడ్లపైకి వస్తున్నారు. భౌతికదూరం పాటిస్తూ తమ పనుల్లో బిజీ అవుతున్నారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు గూగుల్‌ ఓ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గూగుల్‌ మ్యాప్‌ ఇకపై రద్దీ ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు సంబంధించిన అలర్ట్‌ను వినియోగదారులకు అందించనుంది.


ప్రజారవాణా, మెడికల్‌ చెక్‌పాయింట్స్‌, ఇతర ముఖ్యప్రదేశాలకు సంబంధించిన సమాచారాన్ని గూగుల్‌ మ్యాప్స్‌ అలర్ట్‌ రూపంలో చేరవేయనుంది. అంతేకాకుండా గూగుల్‌ మ్యాప్స్‌ ‘డ్రైవర్‌ అలర్ట్‌ ఫీచర్‌’ను పరిచయం చేస్తోంది. ఇందులో కొవిడ్‌-19 చెక్‌పాయింట్స్‌, ఆ మార్గంలో విధించిన నిబంధనలకు సంబంధించిన సమాచారం అలర్ట్‌ రూపంలో అందనుంది. స్థానిక సంస్థలు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వెల్లడించిన సమాచారం, ఇతర ఏజెన్సీల సహాయంతో సేకరించిన సమాచారాన్ని జోడించి విశ్వసనీయమైన డేటాను గూగుల్‌ మ్యాప్స్‌ వినియోగదారులకు అందించనున్నామని గూగుల్‌ ప్రకటించింది.


Updated Date - 2020-06-13T06:00:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising