ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ వైరస్‌ పేరుతో ఈ వైరస్‌! ఇదేం గోలరా నాయనా?

ABN, First Publish Date - 2020-03-09T21:51:57+05:30

ఇంటర్‌నెట్లో జనం వేటి గురించి ఎక్కువగా వెతుకుతున్నారో - ఆ విషయాల పేరుతో కొత్త కొత్త వెబ్‌సైట్‌ డొమైన్లు రిజిస్టర్‌ అవుతూ ఉండడం ప్రపంచంలో సాధారణం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్‌నెట్లో జనం వేటి గురించి ఎక్కువగా వెతుకుతున్నారో - ఆ విషయాల పేరుతో కొత్త కొత్త వెబ్‌సైట్‌ డొమైన్లు రిజిస్టర్‌ అవుతూ ఉండడం ప్రపంచంలో సాధారణం. అలాగే ఇంటర్‌నెట్లో మాల్‌ వేర్‌ ని వ్యాప్తి చేసి సిస్టమ్స్‌ని పాడు చేసే కోడర్లు - ఎప్పుడు ఏ విషయానికి ఎక్కువ పాపులారిటీ ఉంటే దాన్ని - మాల్‌ వేర్‌ వ్యాప్తికి వినియోగించుకుంటూ ఉంటారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కొరొనా వైరస్ - కోవిడ్‌-19 ని వీళ్లంతా బాగా ఉపయోగించుకుంటున్నారట.


చైనాలో వైరస్‌ బయటపడ్డ రోజునుంచీ కరోనా, కోవిడ్‌ లాంటి పేర్లతో కొత్త కొత్త వెబ్‌ డొమైన్లు రిజిస్టర్‌ అవుతున్నాయి. అయితే అవన్నీ నిజాయతీగా ఆ వైరస్‌ గురించిన సమాచారం ఇచ్చేవో, లేదా ఆ వైరస్‌కి సంబంధించిన న్యూస్‌ని అందించేవో - అనుకుంటే పొరబాటే! రిజిస్టర్‌ అయిన డొమైన్లలో సగానికి సగం డొమైన్లు - మాల్‌వేర్‌ని హోస్ట్‌ చేస్తున్నాయట. ఆ డొమైన్లు క్లిక్‌ చేసి సర్వర్లోకి వెళ్తే - మీ కంప్యూటర్‌కి ప్రమాదమే! చెక్‌ పాయింట్‌, ప్రూఫ్‌ పాయింట్‌ అనే రెండు సైబర్‌ సెక్యూరిటీ సంస్థలు ఈ విషయాన్ని కనిపెట్టాయి. ఆరోగ్యానికి సంబంధించిన వైరస్‌తోనే పడలేక చస్తూనే - ఆ పేరు వాడుకుంటూ కంప్యూటర్లని ఎటాక్‌ చేసే ఈ వైరస్‌ ల గొడవేంట్రా బాబూ అని జనం కలవరపడక తప్పదన్నమాట!

Updated Date - 2020-03-09T21:51:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising