ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో సెర్చ్ ఇంజన్... యాపిల్ సన్నాహాలు

ABN, First Publish Date - 2020-09-02T23:15:03+05:30

గూగుల్ సెర్చ్ ఇంజన్లు యాహూ, బింగ్‌లకు పోటీగా ఓ సెర్చ్ ఇంజిన్ ను తెచ్చేందుకు యాపిల్ సన్నాహాలు చేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్ : గూగుల్ సెర్చ్ ఇంజన్లు యాహూ, బింగ్‌లకు పోటీగా ఓ సెర్చ్ ఇంజిన్ ను తెచ్చేందుకు యాపిల్ సన్నాహాలు చేస్తోంది. వాస్తవానికి... గతంలో ఒకటి రెండు సెర్చ్ ఇంజిన్లు వచ్చినా అవి గూగుల్ ముందు నిలబడలేకపోయాయి. టెక్ వెబ్‌సైట్ ‘కోయ్ వోల్ఫ్’ నివేదిక ప్రకారం.. యాపిల్ తన సెర్చ్ ఇంజన్‌ను ప్రారంభించటానికి సిద్దమవుతోంది.


ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటోంది. యాపిల్ తన స్పాట్‌లైట్ సెర్చ్ ఇంజిన్ కోసం ఇంజనీర్లను తీసుకుంటున్నట్లు సమాచారం. స్పాట్‌లైట్ అనేది ఎంఏసీ ఓఎస్ లో ముఖ్యమైన సర్చింగ్ అప్షన్. ఇక్కడ మ్యాక్‌బుక్ నుంచి వెబ్‌కు సర్చింగ్ అవకాశముంటుంది. మరిన్ని వివరాలిలా ఉన్నాయి. యాపిల్ తన కొత్త ఏఓఎస్ 14 వెర్షన్‌లో గూగుల్ సెర్చ్‌ను దాటేసిన విషయం తెలిసిందే. సెర్చ్ ఇంజిన్ల కోసం యాపిల్ చేయబోయే నియామకాలలో ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్(ఎన్నెల్పీ)’ వంటి రంగాల్లోని నిపుణులకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్, ఐప్యాడ్, మాక్ ఓఎస్‌లలో డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్ అయిన గూగుల్‌ను ఉంచడానికి గూగుల్ ఏటా యాపిల్‌కు మిలియన్ల డాలర్లను వెచ్చిస్తోంది. ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు తానే స్వయంగా సెర్చ్ ఇంజన్ ను రూపొందించేందుకు ఫ్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో... త్వరలోనే ఈమేరకు ఒప్పందం చేసుకోనుంది యాపిల్ సంస్థ. కోయ్ వోల్ఫ్ నివేదిక ప్రకారం.. యూకే కాంపిటీషన్ అండ్ మార్కెట్ అథారిటీ నివేదిక ప్రపంచంలో యాపిల్ మార్కెట్ వాటా చాలా ఎక్కువగా ఉంది. ఈ నేపధ్యంలో... గూగుల్ సెర్చ్ డిఫాల్ట్ అయినందున ఇతర సెర్చ్ ఇంజిన్లకు మొబైల్ ఫోన్లలోకి ప్రవేశించే అవకాశం లభించదని నమ్ముతోంది. తాజాగా యాపిల్ రూపొందిస్తున్న ఈసెర్చ్ ఇంజిన్‌ను గూగుల్‌కు ప్రత్యామ్నాయంగా మారనుంది. ప్రాజెక్టు విజయవంతంమైన తర్వాత వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. మొత్తం సెర్చ్ ఇంజన్ విషయంలో మరో నిర్ణయాత్మకమైన పరిణామొం చోటుచేసుకోబోతోందని భావిస్తున్నారు. 

Updated Date - 2020-09-02T23:15:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising