ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మారిపోబోతున్న గూగుల్‌ ట్రాన్స్‌లేట్‌ చరిత్ర!!

ABN, First Publish Date - 2020-03-04T00:16:25+05:30

చరిత్ర సృష్టించాలన్నా మేమే, తిరగరాయాలన్నా మేమే అంటున్నారు గూగుల్‌ వాళ్లు. త్వరలో గూగుల్‌ ట్రాన్స్‌లేట్‌ చరిత్ర మారబోతోంది అని చెబుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చరిత్ర సృష్టించాలన్నా మేమే, తిరగరాయాలన్నా మేమే అంటున్నారు గూగుల్‌ వాళ్లు. త్వరలో గూగుల్‌ ట్రాన్స్‌లేట్‌ చరిత్ర మారబోతోంది అని చెబుతున్నారు.


నిజమే! భాషల్ని పరస్పరం ట్రాన్స్‌ లేట్‌ చేసుకునే విషయంలో గూగుల్‌ నిజంగా ఓ చరిత్రే సృష్టించింది.  అయితే ఇప్పుడు - వాళ్లు చెప్పేది, మనం మాట్లాడుకునేది - ఆ సొంతడబ్బా చరిత్రల గురించి కాదు! గూగుల్‌ ట్రాన్స్‌లేట్‌ అప్లికేషన్‌ వాడినప్పుడు మనం సేవ్‌ చేసుకునే ట్రాన్స్‌లేషన్‌ హిస్టరీ గురించి!


గూగుల్‌ ట్రాన్స్‌లేట్ వాడేటప్పుడు మనం మన అవసరాల కోసం రకరకాల భాషల్నించి అనువాదాలు చేసుకుంటూ ఉంటాం. వాటిలో కొన్నిటిని తరవాత ఉపయోగించుకోవడానికి సేవ్‌ చేసుకుంటాం. దీన్నే హిస్టరీ అంటాం. మనం మన గూగుల్‌ అకౌంట్లోకి లాగిన్‌ అయినప్పుడు మన ట్రాన్స్‌లేషన్‌ హిస్టరీని మనం చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు ట్రాన్స్‌లేట్‌ విషయంలో గూగుల్‌ ఓ మార్పు చేయబోతోంది. ఈ అప్‌డేట్‌ వల్ల ట్రాన్స్‌లేట్‌ హిస్టరీ అంతా ఇకపై - 'మై యాక్టివిటీ' అనే విభాగంలోకి పోబోతోంది.


అయితే ఈ మార్పు జరిగే సమయంలో పాత హిస్టరీ అంతా క్లియర్‌ అయిపోతుందట! అందుకే మీరు గూగుల్‌ ట్రాన్స్‌లేట్‌ యూజ్‌ చేస్తూ ఉన్నట్టయితే - ఇంతవరకూ మీకోసం మీరు సేవ్‌ చేసుకున్న ట్రాన్స్‌లేట్‌ హిస్టరీ అంతటినీ ఎక్కడైనా భద్రపరచుకోండి. ఈ విషయాన్నే గూగుల్‌ హెచ్చరిస్తోంది. కాబట్టి - గూగుల్‌ ట్రాన్స్‌లేట్‌ చరిత్ర తాలూకు భవిష్యత్తు అదీ!

Updated Date - 2020-03-04T00:16:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising