ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరోగ్యసేతు యాప్ ప్రపంచ రికార్డు: అమితాబ్ కాంత్

ABN, First Publish Date - 2020-05-10T01:36:55+05:30

హెల్త్‌కేర్ అప్లికేషన్ల డౌన్‌లోడ్లలో కోవిడ్-19 ట్రాకింగ్ యాప్ ‘ఆరోగ్య సేతు’ ప్రపంచ రికార్డు సృష్టించినట్టు నీతి ఆయోగ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ అప్లికేషన్ల డౌన్‌లోడ్లలో కోవిడ్-19 ట్రాకింగ్ యాప్ ‘ఆరోగ్య సేతు’ ప్రపంచ రికార్డు సృష్టించినట్టు నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ తెలిపారు. మే నాలుగో తేదీ నాటికి దాదాపు 9 కోట్ల మంది యూజర్లు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నట్టు చెప్పారు. ఓ హెల్త్‌కేర్ యాప్‌ ఇన్ని డౌన్‌లోడ్లు సాధించడం ప్రపంచంలోనే ఇది తొలిసారన్నారు. 


కోవిడ్ మహమ్మారిపై పోరులో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల వద్ద ‘ఆరోగ్య సేతు’ తప్పకుండా ఉండాల్సిందేనని కేంద్రం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది.


ఇదో అద్భుతమైన విషయమని, కోవిడ్-19పై పోరులో భాగంగా సాంకేతిక పరిజ్ఞాన్ని పెంచడంలో ప్రపంచంలోనే భారత్ ముందుందని అమితాబ్ కాంత్ ట్వీట్ చేశారు.  

Updated Date - 2020-05-10T01:36:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising