ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ పుకార్లను ఖండించిన యువరాజ్

ABN, First Publish Date - 2020-02-20T01:27:18+05:30

మాజీ టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పిన తరువాత కొత్త దారులు వెతుకున్నాడు. అంతర్జాతీయ, ఐపీఎల్ క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించినప్పటికీ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: మాజీ టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పిన తరువాత కొత్త దారులు వెతుకున్నాడు. అంతర్జాతీయ, ఐపీఎల్ క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించినప్పటికీ.. యువరాజ్ సింగ్ అడపా దడపా ఇతర టీ-20, టీ-10 మ్యాచ్‌లు ఆడుతూ వస్తున్నాడు. త్వరలో జరగనున్న రోడ్ సెఫ్టీ వరల్డ్ టీ-20 సిరీస్‌పైనా యూవీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అయితే.. డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్ యువరాజ్.. త్వరలో ఓ వెబ్ సిరీస్‌ద్వారా తెరంగేట్రం చేస్తున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. అస్సాం కు చెందిన డ్రీమ్ హౌస్ ప్రొడక్షన్ నిర్మించిన వెబ్‌సిరీస్‌లో యూవీ నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. యూవీ సోదరుడు జోరవర్ ప్రధాన పాత్రలో వస్తున్న ఈ సిరీస్‌లో యూవీ భార్య హాజెల్ కీచ్, తల్లి శబ్నమ్ సింగ్‌ కూడా ఉన్నట్లు వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే, ఈ ప్రచారంపై తాజాగా యూవీ స్పందించాడు. ఆ వార్తలో ఎంతమాత్రం నిజం లేదంటూ తేల్చి చెప్పేశాడు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా స్పందించిన యూవీ.. వెబ్‌సిరీస్‌లో తన సోదరుడు నటిస్తున్నాడని, తాను కాదని క్లారిటీ ఇచ్చాడు. తాను నటిస్తున్నట్లు వస్తున్న వార్తలన్నీ పచ్చి అబద్ధం అని కొట్టిపారేశాడు.



Updated Date - 2020-02-20T01:27:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising