ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచిన్‌కి ధీటుగా జవాబు ఇచ్చిన యువీ.. తిరిగి సచిన్‌కే ఛాలెంజ్

ABN, First Publish Date - 2020-05-31T17:36:18+05:30

కరోనా వైరస్‌ను ఎదురుకొనేందుకు స్పూర్తి కలిగించేందుకు టీం ఇండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ‘కీప్ ఇట్ అప్’ అనే ఛాలెంజ్‌ను ప్రారంభించిన విషయం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా వైరస్‌ను ఎదురుకొనేందుకు స్పూర్తి కలిగించేందుకు టీం ఇండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ‘కీప్ ఇట్ అప్’ అనే ఛాలెంజ్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ఛాలెంజ్ చేయాల్సిందిగా అతను క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ని నామినేట్ చేశాడు. అయితే సచిన్ కాస్త వినూత్నంగా.. కళ్లకు గంతలు కట్టుకొని ఈ ఛాలెంజ్‌ను చేసి.. మళ్లీ యువరాజ్‌నే నామినేట్ చేశారు. 


అయితే సచిన్ సవాలుకి యువీ ధీటుగా జవాబు ఇచ్చాడు. వంటింట్లో.. కళ్లకు గంతలు కట్టుకొని ఛపాతీ కర్రతో బంతిని 100 సార్లు కొట్టిన  వీడియోను అతను పోస్ట్ చేశాడు. ‘‘మాస్టర్ మీరు మైదానంలో ఎన్నో రికార్డులు బద్దలుకొట్టారు. కానీ, ఇప్పుడు నా ‘కిచెన్‌లో 100’ రికార్డు బద్దలుకొట్టాల్సిన సమయం వచ్చింది. సారీ, పూర్తి వీడియో షేర్ చేయలేకపోయాను. ఎందుకంటే అది చాలా పెద్దది. సచిన్ మళ్లీ మీకే ఛాలెంజ్ చేస్తున్నాను. కానీ, కిచెన్‌లోని సామాన్లు పగలకొట్టకండి’’ అంటూ యువీ ఈ వీడియోకి క్యాప్ఫన్ పెట్టాడు. మరి దీనిపై సచిన్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.



Updated Date - 2020-05-31T17:36:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising