ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాయిదా పడిన టెస్ట్‌ల్లో సమంగా పాయింట్ల కేటాయింపు..!

ABN, First Publish Date - 2020-10-23T09:43:52+05:30

నిర్దేశించిన షెడ్యూల్‌ ప్రకారం వచ్చే ఏడాది జూన్‌లో ప్రపంచ టెస్ట్‌ చాంపియన్‌షి్‌ప (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ను నిర్వహించాలని ఐసీసీ భావిస్తోంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డబ్ల్యూటీసీ షెడ్యూల్‌ ముగించాలనే ఆలోచనలో ఐసీసీ 

దుబాయ్‌: నిర్దేశించిన షెడ్యూల్‌ ప్రకారం వచ్చే ఏడాది జూన్‌లో ప్రపంచ టెస్ట్‌ చాంపియన్‌షి్‌ప (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ను నిర్వహించాలని ఐసీసీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో చాంపియన్‌షి్‌ప షెడ్యూల్‌ పూర్తి చేయాలనుకుంటోంది. అయితే, కరోనా కారణంగా వాయిదా పడిన ద్వైపాక్షిక సిరీస్‌ల విషయంలో పాయింట్లను సమంగా కేటాయించే విషయమై ఐసీసీ సమాలోచన చేస్తోందని సమాచారం. వచ్చే నెలలో జరిగే ఐసీసీ క్రికెట్‌ కమిటీ సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది. పాయింట్లను సమానంగా పంచడం ఒక ఆలోచన కాగా.. వచ్చే ఏడాది మార్చి వరకు ఆయా జట్లు సాధించిన పాయింట్లను పరిగణనలోకి తీసుకొని ఫైనల్‌ ప్రత్యర్థులను ఖరారు చేయాలనే మరో ఆలోచన కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, సహేతుక కారణాల రీత్యా ఆడలేకపోయిన టెస్ట్‌లను డ్రాగా పరిగణించాల్సి ఉంటుంది. దీంతో వాయిదా పడిన టెస్ట్‌లకు ఇరు జట్లకు 1/3వ వంతు పాయింట్ల చొప్పున దక్కుతాయి.


Updated Date - 2020-10-23T09:43:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising