ఐపీఎల్ తర్వాత లంక పర్యటనకు
ABN, First Publish Date - 2020-10-04T09:21:08+05:30
మహిళల ఐపీఎల్ ముగిశాక భారత మహిళల క్రికెట్ జట్టు శ్రీలంకలో పర్యటించనుంది. మహిళల ఐపీఎల్ వచ్చే నెల 4 నుంచి...
న్యూఢిల్లీ: మహిళల ఐపీఎల్ ముగిశాక భారత మహిళల క్రికెట్ జట్టు శ్రీలంకలో పర్యటించనుంది. మహిళల ఐపీఎల్ వచ్చే నెల 4 నుంచి 9 వరకు యూఏఈలో జరగనుంది. అనంతరం మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు భారత జట్టు శ్రీలంక వెళ్లనున్నట్టు బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. అయితే, 14 రోజుల క్వారంటైన్ నిబంధనపై స్పష్టత రావాల్సి ఉందని ఆ అధికారి చెప్పారు. ఐపీఎల్ పూర్తయ్యాక ఆస్ట్రేలియా పర్యటనకు భారత పురుషుల జట్టు ఏవిధంగా యూఏఈ నుంచి నేరుగా అక్కడికి చేరుకుంటుందో.. మహిళల జట్టు కూడా అలాగే శ్రీలంక వెళుతుందని తెలుస్తోంది. శ్రీలంక పర్యటనపై భారత మహిళల వన్డే జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ సంతోషం వ్యక్తం చేసింది. సుదీర్ఘ విరామానంతరం భారత జెర్సీ ధరించేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్టు ఆమె తెలిపింది.
Updated Date - 2020-10-04T09:21:08+05:30 IST