ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నవంబరు 1 నుంచి చాలెంజర్‌ సిరీస్‌

ABN, First Publish Date - 2020-08-03T09:06:09+05:30

మహిళల ఐపీఎల్‌కు బీసీసీఐ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. చాలెంజర్‌ సిరీస్‌ పేరిట జరిగే ఈ టోర్నీని నవంబరు 1 నుంచి 10 వరకు యూఏఈలోనే నిర్వహించనున్నట్టు బోర్డు ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహిళల ఐపీఎల్‌కు బీసీసీఐ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. చాలెంజర్‌ సిరీస్‌ పేరిట జరిగే ఈ టోర్నీని నవంబరు 1 నుంచి 10 వరకు యూఏఈలోనే నిర్వహించనున్నట్టు బోర్డు అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ తెలిపాడు. దీంతో ఈసారి మహిళల ఐపీఎల్‌ ఉండదేమోనన్న సందేహాలకు ఫుల్‌స్టాప్‌ పడింది. మహిళల టోర్నీలో గతేడాదిలాగే మూడు జట్ల మధ్య నాలుగు మ్యాచ్‌లు జరుగుతాయి. కాగా ఈ టోర్నీ కన్నా ముందే సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఉన్న మహిళా క్రికెటర్లకు శిక్షణ శిబిరం కూడా ఏర్పాటు చేయనున్నారు. ‘ఈ షెడ్యూల్‌ మధ్యలో చాలెంజర్‌ సిరీ్‌సను జరుపుతాం. అలాగే కొవిడ్‌-19 కారణంగా జాతీయ క్రికెట్‌ శిబిరం మూతబడింది కాబట్టి మహిళల ఐపీఎల్‌కన్నా ముందే వారికి శిబిరం ఏర్పాటు చేస్తాం’ అని గంగూలీ అన్నాడు. 

విదేశీ క్రికెటర్ల అసంతృప్తి: మహిళల ఐపీఎల్‌ షెడ్యూల్‌పై విదేశీ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అక్టోబరు 17 నుంచి నవంబరు 29 వరకు బిగ్‌బాష్‌ లీగ్‌ జరుగుతుంది. ఇదే సమయంలో ఐపీఎల్‌ జరగనుంది. దీంతో  అలీసా హీలీ (ఆస్ట్రేలియా), సుజీ బేట్స్‌ (న్యూజిలాండ్‌)లాంటి విదేశీ మహిళా స్టార్లు ఐపీఎల్‌కు దూరమయ్యే పరిస్థితులున్నాయి. ‘మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌తో ఒప్పందం కుదుర్చుకున్న భారత క్రికెటర్లు ఇప్పుడేం చేస్తారు? వారికి గుడ్‌లక్‌’ అంటూ హీలీ ట్వీట్‌ చేయగా.. ‘డబ్ల్యుబీబీఎల్‌, మహిళల ఐపీఎల్‌ ఒకేసారి జరగడం సిగ్గుచేటు’ అని సుజీ బేట్స్‌ వ్యంగ్యంగా ట్వీట్‌ చేసింది.


మిథాలీ హర్షం

మహిళల ఐపీఎల్‌ నిర్వహించాలన్న బీసీసీఐ నిర్ణయంపై మహిళల కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ హర్షం వ్యక్తం చేసింది. మార్చిలో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌ తర్వాత జట్టు క్రికెట్‌కు దూరంగానే ఉంది. ఇంగ్లండ్‌ టూర్‌కు వెళ్లాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడడంతో వచ్చే ఏడాది వన్డే వరల్డ్‌కప్‌ వరకు క్రికెట్‌కు దూరంగా ఉండాల్సిందేమోనని వారంతా భావించారు. ‘ఇది నిజంగా అద్భుతమైన వార్త. మా వరల్డ్‌కప్‌ సన్నాహకాలు ప్రారంభమైనట్టే. మహిళల క్రికెట్‌కు మద్దతుగా నిలిచినందుకు గంగూలీ, జైషా, బీసీసీఐకి కృతజ్ఞతలు’ అని మిథాలీ ట్వీట్‌ చేసింది. అటు వెటరన్‌ స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌ కూడా సంతోషం వ్యక్తం చేసింది. 

Updated Date - 2020-08-03T09:06:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising