ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కష్టాల్లో విండీస్‌

ABN, First Publish Date - 2020-12-13T10:11:27+05:30

న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్‌లోనూ పర్యాటక వెస్టిండీస్‌ బ్యాటింగ్‌లో విఫలమైంది. కైల్‌ జేమిసన్‌ (5/34) ఐదు వికెట్లతో చెలరేగడంతో.. రెండోరోజైన శనివారం ఆట ముగిసేసరికి విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసి పీకల్లోతు కష్టాల్లో పడింది. బ్లాక్‌వుడ్‌ (69) ఒక్కడే అర్ధ సెంచరీతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తొలి ఇన్నింగ్స్‌ 124/8

కివీస్‌ 460 ఆలౌట్‌

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్‌లోనూ పర్యాటక వెస్టిండీస్‌ బ్యాటింగ్‌లో విఫలమైంది. కైల్‌ జేమిసన్‌ (5/34) ఐదు వికెట్లతో చెలరేగడంతో.. రెండోరోజైన శనివారం ఆట ముగిసేసరికి విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసి పీకల్లోతు కష్టాల్లో పడింది. బ్లాక్‌వుడ్‌ (69) ఒక్కడే అర్ధ సెంచరీతో పోరాడాడు. ఓపెనర్లు బ్రాత్‌వైట్‌ (0), క్యాంప్‌బెల్‌ (14)తో పాటు డారెన్‌ బ్రావో (7), బ్రూక్స్‌ (14), రోస్టన్‌ చేజ్‌ (0) విఫలమయ్యారు. టిమ్‌ సౌథీ (3/29) మూడు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 294/6తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన కివీస్‌ 460 స్కోరు వద్ద ఆలౌటైంది. సెంచరీ హీరో హెన్రీ నికోల్స్‌ (174) కేవలం 26 పరుగుల తేడాతో డబుల్‌ సెంచరీ మిస్‌ చేసుకున్నాడు. వాగ్నర్‌ (66 నాటౌట్‌) అర్ధ సెంచరీ చేశాడు. ప్రస్తుతం కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌కు విండీస్‌ 336 రన్స్‌ వెనుకంజలో ఉంది. ఫాలోఆన్‌ గండం తప్పించుకోవాలంటే హోల్డర్‌ సేన్‌ ఇంకా 136 పరుగులు చేయాలి. 

Updated Date - 2020-12-13T10:11:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising