ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుశాల్‌ మెండిస్‌ అరెస్టు

ABN, First Publish Date - 2020-07-06T08:49:32+05:30

ఓ వృద్ధుడి మరణానికి కారణమైన శ్రీలంక స్టార్‌ వికెట్‌ కీపర్‌ కుశాల్‌ మెండి్‌సను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం ఉదయం కొలంబో ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొలంబో: ఓ వృద్ధుడి మరణానికి కారణమైన శ్రీలంక స్టార్‌ వికెట్‌ కీపర్‌ కుశాల్‌ మెండి్‌సను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం ఉదయం కొలంబో శివార్లలోని పాత గాలె రోడ్డు వద్ద ఈ ప్రమాదం జరిగింది. సైకిల్‌పై వెళుతున్న 64 ఏళ్ల వృద్ధుడిని మెండిస్‌ నడుపుతున్న ఎస్‌యూవీ కారు వేగంగా ఢీకొట్టడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మరణించాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న మెండి్‌సను మెజిస్ట్రేట్‌ ముందు సోమవారం హాజరుపర్చనున్నారు. 25 ఏళ్ల కుశాల్‌ మెండిస్‌ లంక తరఫున 44 టెస్టులు, 76 వన్డేలు ఆడాడు.

Updated Date - 2020-07-06T08:49:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising