ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేను ధోనీకి పెద్ద ఫ్యాన్‌ని.. అందుకే ఆయన్ని అనుకరిస్తాను: బంగ్లాదేశ్ కెప్టెన్

ABN, First Publish Date - 2020-05-24T17:11:27+05:30

2004లో అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరంగేట్రం చేసిన టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢాకా: 2004లో అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరంగేట్రం చేసిన టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. వీరిలో బంగ్లాదేశ్ టీ-20 కెప్టెన్ మహ్మదుల్లా కూడా ఒకడని వెల్లడించాడు. తాజాగా లైవ్ ఛాట్‌లో అతను మాట్లాడుతూ.. తాను ధోనీకి పెద్ద ఫ్యాన్‌నని వెల్లడించాడు. 


‘‘నేను ధోనీకి పెద్ద ఫ్యాన్‌ని. అతని ఐదో స్థానంలో బ్యాటింగ్‌ చేస్తాడు. నేను స్టాండ్స్‌లో కూర్చొని అతను గేమ్‌ని కంపోజ్ చేసే తీరును గమనిస్తూ ఉంటాను. అతని మ్యాచ్‌లు టీవీలో కూడా చూస్తాను. ఎన్నో మ్యాచ్‌ల తర్వాత కూడా వన్డేల్లో 50కి పైగా యావరేజ్ ఉండటం సాధారణమైన విషయం కాదు. మ్యాచ్‌ చివరి వరకూ కూడా అతను అద్భుతంగా ఆటని కంట్రోల్ చేస్తాడు. నేను కూడా ఐదు లేదా ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తాను. ఈ విషయాలు అన్ని నేను అతని నుంచే నేర్చుకున్నాను. నా క్రికెట్ జీవితంపై ధోనీ ప్రభావం ఎంతో ఉంది’’ అని మహ్మదుల్లా తెలిపాడు.

Updated Date - 2020-05-24T17:11:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising