ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచిన్ నాకు ఫోన్ చేసినప్పుడు అది జోక్ అనుకున్నాను: లూక్ రైట్

ABN, First Publish Date - 2020-05-28T03:15:18+05:30

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎందరో యువ క్రికెటర్లలోని ప్రతిభను వెలికి తీసింది. భారత్‌కు చెందిన లేదా విదేశాలకు చెందిన ఎందరో క్రికెటర్లు ఈ లీగ్ ద్వారా స్టార్లుగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎందరో యువ క్రికెటర్లలోని ప్రతిభను వెలికి తీసింది. భారత్‌కు చెందిన లేదా విదేశాలకు చెందిన ఎందరో క్రికెటర్లు ఈ లీగ్ ద్వారా స్టార్లుగా ఎదిగారు. అలాంటి ఈ ప్రతిష్టాత్మక లీగ్‌లో పాల్గొనాలను ప్రతీ ఒక్కరు ఆసక్తి కనబరుస్తారు. అయితే ఈ లీగ్‌లో పాల్గొనాలని స్వయంగా సచిన్ టెండూల్కర్ నుంచి ఆఫర్ వస్తే.. అది జోక్‌ అనుకున్నానని ఇంగ్లండ్ ఆల్ రౌండర్ లూక్ రైట్ అన్నారు. 2008 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడాలని తనకు సచిన్ ఫోన్ చేశారని.. కానీ అప్పుడు అతను అది నిజం అనుకోలేదని అతను తెలిపాడు. 


అయితే అప్పటి ఇంగ్ల్డండ్ క్రికెట్ బోర్డు నిబంధనల ప్రకారం అతనికి ఐపీఎల్‌లో ఆడే అవకాశం రాలేదు. ఒకవేళ తన కెరీర్ ఆరంభంలో తనకు ఐపీఎల్ ఆడే అవకాశం వచ్చుంటే.. తన ప్రతిభ మరింత మెరుగుపడేదని అతను పేర్కొన్నాడు. ‘‘ఇంగ్లండ్‌కి ఆడకముందు నేను ఫ్రాంచైజీల తరఫున ఆడి ఉంటే.. నాకు ఎంతో లాభం చేకూరేది. అందుకే ఆరంభంలో నేను ఐపీఎల్‌ని మిస్ అయ్యాను. ముఖ్యంగా సచిన్ టెండూల్కర్ నాకు ఫోన్ చేసి మొదటి ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడాలని కోరారు. కానీ నేను అది జోక్ అనుకున్నాను. ఎవరో పోకిరి కుర్రాళ్లు మిమిక్రి చేస్తున్నారని భావించాను’’ అని రైట్ పేర్కొన్నాడు. 

Updated Date - 2020-05-28T03:15:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising