సంజితకు ఊరట
ABN, First Publish Date - 2020-06-11T09:37:16+05:30
డోపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత వెయిట్ లిఫ్టర్ సంజిత చానుకు ఊరట లభించింది. ఆమెపై పడ్డ డోపింగ్ మచ్చ తొలగిపోయింది...
న్యూఢిల్లీ: డోపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత వెయిట్ లిఫ్టర్ సంజిత చానుకు ఊరట లభించింది. ఆమెపై పడ్డ డోపింగ్ మచ్చ తొలగిపోయింది. శాంపిల్ విషయంలో జరిగిన పొరబాటు కారణంగా ఆమెపై విధించిన నిషేధాన్ని అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్) బుధవారం ఎత్తివేసింది. వాడా సిఫారసుల మేరకు అంతర్జాతీయ సమాఖ్య ఈ నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లూ చేయని తప్పుకు శిక్ష అనుభవించానన్న సంజిత.. తనను మానసిక క్షోభకు గురి చేసిందుకుగాను బాధ్యులు క్షమాపణలు చెప్పడంతోపాటు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. 2017, నవంబరులో వరల్డ్ చాంపియన్‌షిప్‌కు ముందు నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో చాను నిషేధిత ఉత్ర్పేరకాలు ఉపయోగించినట్టు తేలింది. కానీ, 2018 మేలో ఆమెపై తాత్కాలిక నిషేధం విధించారు. కాగా.. తాజాగా తనపై డోపింగ్ మచ్చ తొలగిపోవడంతో సంజిత ఇప్పుడు అర్జున అవార్డు రేసులోకొచ్చింది. ఇప్పటికే అర్జునకు సంజిత పేరును జాతీయ లిఫ్టింగ్ సమాఖ్య ప్రతిపాదించినా, డోపింగ్ కేసు నడుస్తున్నందున ఆమె పేరును పరిగణనలోకి తీసుకోలేమని క్రీడాశాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Updated Date - 2020-06-11T09:37:16+05:30 IST