ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శారీరక ఆరోగ్యంతో చురుకైన బుర్ర

ABN, First Publish Date - 2020-09-25T09:12:55+05:30

మెదడు చురుగ్గా ఉండాలంటే..శారీరకంగా దృఢంగా ఉండడం ముఖ్యమని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అన్నాడు. ‘ఫిట్‌ ఇండియా ఉద్యమం’ తొలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మెదడు చురుగ్గా ఉండాలంటే..శారీరకంగా దృఢంగా ఉండడం ముఖ్యమని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అన్నాడు. ‘ఫిట్‌ ఇండియా ఉద్యమం’ తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని పలువురు క్రీడాకారులు, ఫిట్‌నెస్‌ నిపుణులు, ఫిట్‌నె్‌సకు అత్యధిక ప్రాధాన్యమిచ్చే వ్యక్తులతో గురువారం ఆన్‌లైన్‌లో సంభాషించారు. భారత క్రికెటర్లకు నిర్వహించే యో-యో పరీక్ష అంటే ఏమిటని ప్రధాని ...కోహ్లీని ప్రశ్నించారు. ఈ సందర్భంగా..విరాట్‌ మాట్లాడుతూ ‘బుర్ర చురుగ్గా ఉండాలంటే శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి. ఫిట్‌నెస్‌ మన ప్రథమ ప్రాధాన్యం కావాలి. రెండు భోజనాల మధ్య తగినంత విరామం కావాలి. దానివల్ల తిన్న ఆహారం సక్రమంగా వంటబడుతుంది’ అని ప్రధానితో అన్నాడు. ఫిట్‌నెస్‌ తనకు అత్యంత ప్రాధాన్య విషయమని చెప్పాడు. ‘ఒకరోజు ప్రాక్టీస్‌నైనా మానతానేమోకానీ..ఫిట్‌నెస్‌ సెషన్‌ను మాత్రం ఎట్టిపరిస్థితుల్లో మిస్‌కాను’ అని విరాట్‌ తెలిపాడు. కాగా కష్టాలెదురైనా వ్యాయామాన్ని వదలకుండా కొనసాగించడం ముఖ్యమని పారాలింపియన్‌ దేవేంద్ర ఝఝారియా అన్నాడు. ఉదయాన్నే లేవడం, దేశంలోని మహిళలకు స్ఫూర్తిగా నిలవాలన్న లక్ష్యంతో వ్యాయామాలు చేస్తూ తన ఫిట్‌నె్‌సను కాపాడుకుంటున్నానని జమ్మూకశ్మీర్‌కు చెందిన మహిళా ఫుట్‌బాలర్‌ అఫ్సాన్‌ ఆషిక్‌ చెప్పింది. 

Updated Date - 2020-09-25T09:12:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising