ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇన్‌స్టా ప్రభావశీల వ్యక్తుల్లో మోదీని దాటి ముందుకు..

ABN, First Publish Date - 2020-12-15T06:15:53+05:30

ఇన్‌స్టాగ్రామ్‌ ప్రభావశీల వ్యక్తుల్లో విరాట్‌ కోహ్లీ.. ప్రధాని నరేంద్ర మోదీ కన్నా ముందు వరుసలో ఉన్నాడు. హైప్‌ ఆడిటర్స్‌ రూపొందించిన ప్రపంచ వ్యాప్త వెయ్యి మంది ఇన్‌స్టా ప్రభావశీలుర జాబితాలో పోర్చుగీసు ఫుట్‌బాలర్‌ క్రిస్టియానో రొనాల్డో టాప్‌లో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • విరాట్‌ కోహ్లీ ఘనత

న్యూఢిల్లీ: ఇన్‌స్టాగ్రామ్‌ ప్రభావశీల వ్యక్తుల్లో విరాట్‌ కోహ్లీ.. ప్రధాని నరేంద్ర మోదీ కన్నా ముందు వరుసలో ఉన్నాడు. హైప్‌ ఆడిటర్స్‌ రూపొందించిన ప్రపంచ వ్యాప్త వెయ్యి మంది ఇన్‌స్టా ప్రభావశీలుర జాబితాలో పోర్చుగీసు ఫుట్‌బాలర్‌ క్రిస్టియానో రొనాల్డో టాప్‌లో నిలవగా.. అర్జెంటీనా సాకర్‌ స్టార్‌ మెస్సీ 4వ స్థానంలో ఉన్నాడు. విరాట్‌ 12వ, మోదీ 20వ స్థానాల్లో నిలిచారు. బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ నెమార్‌కు 13వ ర్యాంక్‌ దక్కింది.


ట్విటర్‌లో టాపర్‌గా..

ఈ ఏడాది ట్విటర్‌లో అత్యధికంగా ప్రస్తావించిన భారత అథ్లెట్‌గా విరాట్‌ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. పురుషుల జాబితాలో ధోనీ, రోహిత్‌ శర్మను వెనక్కు నెట్టి విరాట్‌ ప్రథమ స్థానాన్ని అలంకరించాడు. కాగా, ట్విటర్‌లో ఎక్కువగా ట్వీట్‌ చేసిన మహిళల్లో బ్యాడ్మింటన్‌ స్టార్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌ వరుసగా  రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఈ జాబితాలో రెజ్లర్‌ గీతా ఫొగట్‌ అగ్రస్థానం దక్కించుకొంది. తన రిటైర్మెంట్‌ సందర్భంగా ప్రధాని మోదీ రాసిన లేఖకు ధన్యవాదాలు చెబుతూ ధోనీ చేసిన ట్వీట్‌.. అత్యధికంగా రీట్వీట్‌ చేసిన ఓ అథ్లెట్‌ ట్వీట్‌గా నిలిచింది. క్రీడల విభాగంలో ఎక్కువ మంది ఇష్టపడి, కోట్‌ చేసిన ట్వీట్‌ అనుష్క ప్రెగ్నెన్సీ వార్త కావడం విశేషం. 

Updated Date - 2020-12-15T06:15:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising