ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్టాండ్ ఇన్ కెప్టెన్ రహానేను ప్రశంసించిన కోహ్లీ

ABN, First Publish Date - 2020-12-29T22:55:51+05:30

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో ఘన విజయం సాధించిన భారత జట్టును విరాట్ కోహ్లీ ప్రశంసించాడు. నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇరు జట్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో ఘన విజయం సాధించిన భారత జట్టును విరాట్ కోహ్లీ ప్రశంసించాడు. నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్‌లో విజయం సాధించి సమ ఉజ్జీలుగా ఉన్నాయి. తొలి టెస్టు తర్వాత పితృత్వ సెలవుపై భారత్ చేసుకున్న కోహ్లీ సోషల్ మీడియా వేదికగా భారత జట్టుపై ప్రశంసలు కురిపించాడు. ఇదో గొప్ప విజయమని, జట్టు మొత్తం అద్భుతంగా ఆడిందని ప్రశంసించాడు. చాలా ఆనందంగా ఉందని, ముఖ్యంగా రహానే జట్టును విజయం దిశగా నడిపించిన తీరు అద్భుతమని కొనియాడాడు. ఎత్తుపల్లాలు ఇక్కడ సహజమేనని పేర్కొన్నాడు. 


రెండు టెస్టులో భారత జట్టు నాలుగో రోజు విజయం సాధించింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అద్భుతంగా ఆడాడు. 36 బంతుల్లో 35 పరుగులు చేశాడు. ఇందులో ఏడు ఫోర్లు ఉన్నాయి. అంతకుముందు ఆస్ట్రేలియా 200 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆతిథ్య జట్టుకు 69 పరుగుల ఆధిక్యం మాత్రమే లభించింది.


అనంతరం 70 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ ఆదిలోనే మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా వికెట్లను కోల్పోయింది. అయితే, స్టాండ్ ఇన్ కెప్టెన్ రహానే, గిల్ కలిసి భారత జట్టుకు అద్వితీయ విజయాన్ని అందించారు. తొలి టెస్టులో అద్భుత సెంచరీతో జట్టును ఆదుకున్న రహానేకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా మూడో టెస్టు వచ్చే నెల 7న సిడ్నీ క్రికతెట్ గ్రౌండ్‌లో ప్రారంభం కానుంది. 

Updated Date - 2020-12-29T22:55:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising