కోహ్లీ స్ఫూర్తి నింపిన వారిలో నేనొకడిని: రాహుల్ తెవాటియా
ABN, First Publish Date - 2020-10-05T00:23:05+05:30
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎంతమందికి స్ఫూర్తి ప్రదాత అని, అలాంటి వారిలో తానొకడినని యువ
అబుదాబి: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎంతమందికి స్ఫూర్తి ప్రదాత అని, అలాంటి వారిలో తానొకడినని యువ సంచలనం, రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండర్ రాహుల్ తెవాటియా అన్నాడు. అబుదాబిలో శనివారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లీ సంతకం చేసిన జెర్సీని అతడి చేతి నుంచి అందుకోవడం తనకో మధురానుభూతి అని, ఆ ఆనందాన్ని వర్ణించలేనని పేర్కొన్నాడు.
కోహ్లీని ‘లెజెండ్ ఆఫ్ ది గేమ్’గా అభివర్ణించిన తెవాటియా మ్యాచ్ ప్రారంభానికి ముందు జెర్సీ కావాలని కోహ్లీని అడిగానని, దీంతో అతడు సంతకం చేసిన జెర్సీని తనకు ఇచ్చాడని పేర్కొన్నాడు. ‘‘మ్యాచ్‌కు ముందు జెర్సీ కావాలని కోహ్లీని అడిగాను. కోహ్లీ వచ్చి అతడు సంతకం చేసిన జెర్సీని నాకు ఇచ్చాడు. అదో ప్రత్యేకమైన అనుభూతి. అతడో ‘క్రికెట్ లెజెండ్’ అని సంతోషం వ్యక్తం చేశాడు.
Updated Date - 2020-10-05T00:23:05+05:30 IST