ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధోనీ నమ్మకంతోనే కెప్టెన్‌ అయ్యా..!

ABN, First Publish Date - 2020-05-31T08:57:18+05:30

మహేంద్ర సింగ్‌ ధోనీ వారసుడిగా జట్టు పగ్గాలు చేపట్టిన విరాట్‌ కోహ్లీ ఇప్పటికే తన సత్తాను నిరూపించుకున్నాడు. అద్భుత ఆటతీరుతో పాటు కెప్టెన్‌గానూ ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మహేంద్ర సింగ్‌ ధోనీ వారసుడిగా జట్టు పగ్గాలు చేపట్టిన విరాట్‌ కోహ్లీ ఇప్పటికే తన సత్తాను నిరూపించుకున్నాడు. అద్భుత ఆటతీరుతో పాటు కెప్టెన్‌గానూ టీమిండియాను ఉన్నత స్థానంలో నిలిపాడు. ఇందుకు కారణంగా తాను ఎక్కువకాలం ధోనీ సహచర్యంలో గడపడమేనని స్పిన్నర్‌ అశ్విన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌చాట్‌లో కోహ్లీ తెలిపాడు. ‘ధోనీ రాజీనామా చేసిన వెంటనే సెలెక్టర్లు వచ్చి నన్ను కెప్టెన్‌గా ఉండమని చెప్పలేదు. అంతకంటే ముందు చాలా జరిగింది. మ్యాచ్‌ల సమయంలో ధోనీ నన్ను బాగా పరిశీలించేవాడు. అతడి తర్వాత జట్టును ముందుకు తీసుకెళ్లే ప్రతిభ ఉందని నాపై నమ్మకముంచాడు. స్లిప్‌లో అతడి పక్కనే ఫీల్డింగ్‌ చేసేవాడిని. ఈ క్రమంలో రెగ్యులర్‌గా ధోనీతో మాట్లాడే అవకాశం దక్కేది. నా అభిప్రాయాలతో చాలా వరకు విభేదించేవాడు కానీ విభిన్న విషయాలను చర్చించేవాడు. ఇదంతా చూశాకే అతనికి నాపై నమ్మకం కుదిరి కెప్టెన్‌గా రాణిస్తాడని భావించాడు’ అని కోహ్లీ వివరించాడు.

Updated Date - 2020-05-31T08:57:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising