ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐపీఎల్‌లో మరో రెండు జట్లు..!

ABN, First Publish Date - 2020-12-04T09:18:00+05:30

ఐపీఎల్‌లో జట్ల సంఖ్యను పెంచేందుకు బీసీసీఐ రంగం సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం 8 టీమ్‌లున్న మెగా లీగ్‌లో కొత్తగా రెండు ఫ్రాంచైజీలకు అవకాశం కల్పించడం, 2028 లాస్‌ ఏంజిల్స్‌ ఒలింపిక్స్‌లో ఆడే విషయమై అభిప్రాయసేకరణ ప్రధాన ఎజెండాగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  •  ఈ నెల 24న బీసీసీఐ ఏజీఎం
  •  టీమ్‌ల పెంపుపై నిర్ణయం


న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో జట్ల సంఖ్యను పెంచేందుకు బీసీసీఐ రంగం సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం 8 టీమ్‌లున్న మెగా లీగ్‌లో కొత్తగా రెండు ఫ్రాంచైజీలకు అవకాశం కల్పించడం, 2028 లాస్‌ ఏంజిల్స్‌ ఒలింపిక్స్‌లో ఆడే విషయమై అభిప్రాయసేకరణ ప్రధాన ఎజెండాగా ఈ నెల 24న ముంబైలో బీసీసీఐ సర్వసభ్య సమావేశం (ఏజీఎం) నిర్వహించనుంది. లీగ్‌లో జట్ల సంఖ్యను పెంచే విషయాన్ని బీసీసీఐ సీరియస్‌గా పరిశీలిస్తున్నదనే వార్తలు యూఏఈలో ఐపీఎల్‌-13 ముగిసిన వెంటనే వెలువడ్డాయి. రెండు టీమ్‌లకు వీలుకాకపోతే కనీసం ఒక్క జట్టునైనా చేర్చేందుకు బోర్డు సిద్ధమైందని తెలిసింది. 2008లో ప్రారంభమైన ఐపీఎల్‌లో ప్రస్తుతం 8 ఫ్రాంచైజీలున్నాయి. ఐపీఎల్‌ ఫైనల్‌ సందర్భంగా నూతన జట్ల చేరికపై బోర్డు అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, కార్యదర్శి జైషా చూచాయగా చెప్పినట్టు సమాచా రం. ఏజీఎంలో చర్చించిన తర్వాత తుది నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనున్నా రు. రాష్ట్ర సంఘాలకు అందజేసిన 23 అంశాల ఏజీఎం ఎజెండాలో ‘ఐపీఎల్‌లో రెండు కొత్త టీమ్‌’ల అంశంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. బోర్డు రాజ్యాంగం ప్రకారం ఏజీఎం నిర్వహణకు 21 రోజు   ల ముందు అనుబంధ సంఘాలకు నోటీసులు ఇవ్వాలి. ఎజెండాలో చర్చించబోయే అంశాలను కూడా పేర్కొనాలి. కొత్త ఉపాధ్యక్షుడి ఎన్నిక, ఐపీఎల్‌ పాలకమండలికి ఇద్దరు ప్రతినిధుల ఎలెక్షన్‌, 2020-21 బడ్జెట్‌ ఆమోదం, ఐసీసీ, ఇతర ప్రపంచస్థాయి సంస్థల్లో బీసీసీఐ ప్రతినిధి నియామకం, టీమిండియా టూర్లపై అప్‌డేషన్లు, టీ20 వరల్డ్‌కప్‌ అంశాలపై వివరణ, అంపైర్ల కమిటీ ఏర్పాటు అంశాలు కూడా ఎజెండాలో ఉన్నాయి. 


ఒలింపిక్స్‌లో ఆడడంపై..: లాస్‌ ఏంజిల్స్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు దక్కుతుందని ఐసీసీ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. అయితే, భారత్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా లాంటి పెద్ద టీమ్‌లు బరిలోకి దిగడంపై మాత్రం కొంత అనుమానం ఉన్నా.. గతేడాది బీసీసీఐ కూడా జాతీయ డోపింగ్‌ నిరోధక ఏజెన్సీ (నాడా) కిందకు రావడం ఐసీసీ ఆశలను పెంచుతోంది. ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు ప్రభుత్వాల నుంచి వీలైనంత ఆర్థిక ప్రయోజనాలను ఎలా పొందాలనే దానిపై సభ్య బోర్డుల నుంచి ఐసీసీ సూచనలు కోరింది.


Updated Date - 2020-12-04T09:18:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising